వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కే కాదు..ప్రధాని సొంత రాష్ట్రంలోనూ అదే సమస్య..!!

|
Google Oneindia TeluguNews

ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం. ఇప్పుడు ఏపీలో ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అదే ఇప్పుడు గుజరాత్ లోనూ ఆందోళనలకు కారణమవుతోంది. ఏపీలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో తాను అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానం రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్ల కాలంలో 95 శాతం హామీలు అమలు చేసామని ప్రభుత్వం చెబుతోంది. అమలు కాని హామీల్లో సీపీఎస్ ఒకటిగా వివరణ ఇస్తోంది. సీపీఎస్ రద్దు అంశం పై ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.

పాత పెన్షన్ విధానం పునరిద్దరించాలంటూ

పాత పెన్షన్ విధానం పునరిద్దరించాలంటూ

ఇదే సమయంలో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను తెర పైకి తీసుకొస్తోంది. కానీ, పరిష్కారం లభించ లేదు. దీంతో.. రెండు నెలల్లో దీని పైన పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రభుత్వం సమయం తీసుకుంటూ నిర్ణయించింది. దీని పైన ప్రతిపక్షాలు అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి.

ఇదే సమయంలో గుజరాత్ లోనూ ఉద్యోగుల పెన్షన్ వ్యవహారం నిరసనలకు కారణమవుతోంది. కొద్ది నెలల్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జగనున్నాయి. ఇప్పుడు అక్కడ పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలంటూ టీచర్లు సహా ప్రభుత్వోద్యోగులంతా శనివారం మూకుమ్మడి సెలవు పెట్టటం కలకలం రేపింది. అక్కడ ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం చర్చలు చేసింది.

మాస్ క్యాజువల్ లీవ్ లో ఉద్యోగులు

మాస్ క్యాజువల్ లీవ్ లో ఉద్యోగులు

ఇతర సమస్యలకు చర్చల్లో పరిష్కారం లభించింది. కానీ, పెన్షన్ స్కీం విషయంలో ప్రభుత్వం నుంచి హామీ రాకపోవటం పైన ఉద్యోగులు జేఏసీ నేతలతో విభేదించారు. కొన్ని సంఘాల్లో భాగ్వాములైన ఉద్యోగులు శనివారం మూకుమ్మడి సెలవును కొనసాగించాయి. దాదాపు ఏడు వేల మంది ఉపాధ్యాయులు మూకుమ్మడి సెలవులో ఉన్నారు. గాంధీనగర్‌లోని పాత సచివాలయ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు.

పాత పెన్షన్ విధానం తిరిగి ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2005 ఏప్రిల్ 1కి ముందు ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే పాత పెన్షన్ విధానం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో..చర్చలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీ - గుజరాత్ ప్రభుత్వాలకు సమస్యగా

ఏపీ - గుజరాత్ ప్రభుత్వాలకు సమస్యగా

పాత పెన్షన్ విధానం పునరుద్దరించటానికి బదులుగా కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ను పది నుంచి 14 శాతానికి పెంచింది. ఇదే సమయంలో పోలీసులు..అంగన్ వాడీ కార్యకర్తలు..ఆరోగ్య కార్యకర్తల వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే గుజరాత్ లో ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు కొనసాగిస్తున్నాయి.

ఉద్యోగుల పెన్షన్ డిమాండ్ ను ఆప్ తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో కలిసి నిరసనలు కొనసాగిస్తోది. దీంతో..ఇప్పుడు ఇటు ఏపీలో..అటు గుజరాత్ లో ఈ పెన్షన్ వ్యవహారం సమస్యగా మారుతోంది.

English summary
Employees of the Gujarat government, including schoolt eachers, joined a “mass casual leave” protest across the state demanding implementation of the old pension scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X