పెద్దిరెడ్డికి ఉక్కిరి బిక్కిరి - ప్రభుత్వ తాజా నిర్ణయంతో..!!

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతల పైన ఉన్న ఆరోపణల పై వరుసగా విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పైన పెద్దఎత్తున భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. దీని పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తోంది. పెద్దిరెడ్డి టార్గెట్ గా వేగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

పెద్దరెడ్డి పై ఆరోపణలు
వైసీపీ ముఖ్య నేతల లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చిత్తూరు జిల్లాలో భూ ఆక్రమణల పైన ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి భూములు ఆక్రమించారనే ఫిర్యాదుల న ప్రభుత్వం పూర్తి నివేదిక కోరింది. విచారణ చేసిన జిల్లా అధికారులు పెద్దిరెడ్డి కుటుంబం అక్రమం గా వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లోకి ఎక్కించుకున్నారని తేల్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం.

Government Seek report over Peddireddy Land Grabbing allegations in Chittoor dist

అధికారుల విచారణ
ఆక్రమించినట్లుగా చెబుతున్న సర్వే నెంబర్లలో భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్‌ మధ్యలో ఉందని అధికారులు చెబుతున్నారు. దీని పైన అటవీ శాఖ అధికారులు క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తన పైన వచ్చిన ఆరోపణలను పెద్దిరెడ్డి ఖండించారు. ఇదే భూములపై కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా విచారణకు ఆదేశించారని చెప్పుకొచ్చారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి ఇది అటవీభూమి కాదు, ప్రైవేటు భూమి అని నిర్ధారిం చారని పేర్కొన్నారు. తిరిగి 2014లోనూ ఇదే అంశం పైన ఫిర్యాదు చేసారని గుర్తు చేసారు.

ఖండిస్తున్న పెద్దిరెడ్డి
ఆ సమయంలో మరోసారి దీనిపై విచారణ జరిపిన అధికారులు ఈ భూమి ప్రైవేటు భూమి అని నిర్ధారించారని చెప్పారు. దీనిపై వెంకటరమణారెడ్డి హైకోర్ట్ లో కూడా కేసు వేశారని వివరించారు. అక్కడ కూడా ఈకేసును డిస్మిస్ చేశారని వెల్లడించారు. ఫారెస్ట్ గెజిట్ లో 1968లోనే ఇది ప్రైవేటు భూమి అని చూపించారని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడు ఈ భూమల అంశం పైన సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ చేయటంతో.. అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో నివేదిక సిద్దం అవుతోంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పెద్దిరెడ్డి భూముల విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+