సంక్షేమం , సమానత్వం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు : గవర్నర్..!!
ఏప ప్రభుత్వం సంక్షేమం - సమానత్వం లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తుందని గవర్నర్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరి మద్దతు అవసరం అని ఆకాంక్షించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఈ అయిదేళ్ల కాలంలో సాధించిన పురోగతి..అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
ఇచ్చిన హామీల అమలు: గవర్నర్ నజీర్ అహ్మద్ ఏపీలో వైసీపీ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను విశ్లేషించారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించిందని చెప్పారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం అని ప్రశంసించారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇది పేదల ప్రభుత్వమన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశారని చెప్పిన గవర్నర్..ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనను అందిస్తున్నారని వివరించారు.
సంక్షేమానికి ప్రాధాన్యత: విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదివే విద్యార్ధులను గుర్తించి రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నారన్నారు. 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు ద్వారా పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు.
ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. నాడు - నేడు ద్వారా పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు మారుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
— YSR Congress Party (@YSRCParty) February 5, 2024
పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం
-గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు #APAssembly#YSJaganForQualityEducation#YSJaganAgain pic.twitter.com/2wyIO5fYDO
భవిష్యత్ పై భరోసా: ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించారని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారని గవర్నర్ వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ ప్రభుత్వం నిలబెట్టుకొనేందుకు పని చేసిందని వివరించారు. రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేసారని చెప్పారు.
వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా 78.84 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. సముద్ర తీర ప్రాంతంలో ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. ఉద్దానంలో రక్షిత మంచినీటి సరఫరా, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు ప్రశంసనీయమని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications