రాజ్‌నాథ్‌తో గవర్నర్ నరసింహన్ భేటీ.. రేపు ప్రధాని మోడీతో

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని నివేదికలను అందజేయనున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై గవర్నర్ కేంద్ర మంత్రికి వివరించారు. గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కీలక సందర్భాల్లో గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజ్‌నాథ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Governor Narasimhan to meet Narendra Modi in Delhi tomorrow

20 శాతం పెరిగిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం

దక్షిణమధ్య రైల్వే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం వృద్ధిని నమోదు చేసిందని పౌర సంబంధాల అధికారి సాంబశివరావు తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్, నవంబర్ మధ్య కాలంలో రూ.8,103 కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు.

గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయం రూ.6,738 కోట్లతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువని పేర్కొన్నారు. నవంబరు 2014 నాటికి 10 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, 2013తో పోలిస్తే, 19.6 శాతం వృద్ధిని సాధించామన్నారు. సిమెంటు రవాణాలో 6 శాతం పెరుగుదల నమోదైందన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి 3.2 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని రవాణా చేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+