ఢిల్లీలో గవర్నర్ నరసింహన్: ఓటుకు నోటుపై నో కామెంట్
న్యూఢిల్లీ: నోటుకు ఓటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీ వచ్చారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు.
బుధవారం నాడు ప్రధాని మోదీని, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుస్తానని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు వ్యవహారంపై, రాష్ర్టపతికి జగన్ ఫిర్యాదు చేసిన ఉదంతంపై స్పందించేందుకు గవర్నర్ నిరాకరించారు.

నోటుకు ఓటు వ్యవహారంపై నో కామెంట్ అంటూ మాట్లాడేందుకు నిరాకరించారు. న్యూఢిల్లీ పర్యటన అందుకేనా అని మీడియా ప్రతినిధులు అడిగితే రాష్ట్ర విభజన జరిగిన ఏడాది పూర్తి అయిందని, ఇరు రాష్ట్రాల వివరాలను అందించేందుకు తాను ఢిల్లీ వచ్చానని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను తాను మర్యాదపూర్వకంగానే కలుస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications