త్వరలోనే ప్రతీ ఇంటికీ, మరో హామీ అమలు - గవర్నర్..!!
ప్రజా సంక్షేమం అనే కోణంలోనే.. ప్రభుత్వం ప్రతీ నిర్ణయాన్ని తీసుకుంటోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు, పరిణామాలు చవిచూశాయని గుర్తు చేసారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు. ఏడాదికి రూ.33వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను.. సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ఇరు సభలనుద్దేశించి ప్రసంగించారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోందని వివరించారు. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 5,757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. మత్స్యకార సేవలో పథకం ద్వారా 1.2 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. లక్ష మందికి పైగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోందని గవర్నర్ చెప్పారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారన్నారు.
ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత
2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పజెప్పారని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతోందని వెల్లడించారు. 19 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని పునర్నిర్మించి గాడిలో పెట్టిందన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రీస్టార్ట్ అయ్యాయని తెలిపారు. తొలి 9 నెలల కాలంలో దిద్దుబాటు చర్యలు, పాలసీలు, వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసి పారదర్శకమైన పాలనను కూటమి ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పాలన సాగిస్తోందన్నారు. పది సూత్రాలను నిర్దేశించుకుని.. ప్రజలకు సుపరిపాలన అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా చేసుకుని ప్రభుత్వ పాలన సాగుతోందని అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. త్వరలోనే ఫ్యామిలీ కార్డు అందిస్తామని ప్రకటించారు. అందరికీ ఇల్లు.. అనే లక్ష్యం తో గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం చేపడుతోందని గవర్నర్ వివరించారు. ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి రంగాల్లో దూసుకెళ్తోందని గవర్నర్ పేర్కొన్నారు.
-
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications