వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమ పేరు - ప్రభుత్వ నిర్ణయం పై ఉత్కంఠ : ముగిసిన గడువు - ప్రకటన అప్పుడేనా..!!

|
Google Oneindia TeluguNews

కోనసీమ. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సున్నితంగా మారిన వ్యవహారం. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా.. ఇప్పుడు కోనసీమ జిల్లా పేరు వివాదానికి కారణమైంది. జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని పైన మే 18 నుంచి జూన్‌ 18 లోపు అభ్యంతరాలు, అభీష్టాలు, సూచనలు తెలియచేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఆ సమయం ముగిసింది. ఈ నోటిఫికేషన్ జారీ తరువాత ఆకస్మికంగా అమలాపురం కేంద్రంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. భారీ విధ్వంసం జరిగింది.

ముగిసిన అభ్యంతరాల గడువు

ముగిసిన అభ్యంతరాల గడువు

నాటి ఘటనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లను దహనం చేశారు. అప్పటి నుంచి జిల్లాలో పరిణామాలను పోలీసులు డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. విధ్వంసానికి కారణమైన వారిని పెద్ద సంఖ్యలో అరెస్టు చేసారు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. 14 రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. పోలీసులు నమోదు చేసిన ఏడు కేసుల్లో ఇప్పటివరకు 176 మందిని అరెస్టు చేసారు. జిల్లా ఎస్పీ సైతం బదిలీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని 22 మండలాల ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు.

కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి నివేదిక

కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి నివేదిక


దాదాపు ఆరు వేలకు పైగా అభిప్రాయాలు జిల్లా అధికారులకు నివేదించినట్లుగా సమాచారం. అందులో పలు అభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటినీ క్రోడీకరించి.. ప్రజాభిప్రాయం ఎలా ఉందో స్పష్టతకు రానున్నారు. క్రోడీకరణ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేసి.. నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ నెల 22న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ఈ అంశం పైనా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ


సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం జిల్లా అధికారుల నివేదిక ఆధారంగా..మెజార్టీ అభిప్రాయం మేరకు పేరును ప్రకటిస్తుందా..లేక, ఎటువంటి వివాదం లేకుండా ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తుందా అనేది ఈ సమావేశంలో తేలే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు సైతం అలెర్ట్‌ అయ్యారు. పరిస్థితులను ఎక్కడికక్కడే అంచనా వేస్తూ అందుకు తగిన రీతిలో ముందస్తు భద్రతను కఠినతరం చేస్తున్నారు. అయితే, సున్నితంగా మారిన ఈ వ్యవహారం లో ప్రభుత్వ నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.

English summary
Govt to take decision on Konaseema District name, notification period completed for the obejections and suggetions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X