వివేకా హత్య కేసు పై సవాంగ్ : సీఎం జగన్ ఏం చెప్పారంటే : రెండు ఫ్యామిలీలు..రెండు కళ్లు..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో భాగంగా పలువురు ఇచ్చిన స్టేట్ మెంట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శల పైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత డీజీపీగా సవాంగ్ నియమితులయ్యారు.

జగన్ తనతో ఏం చెప్పారంటే
ఈ కేసు విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారంటూ సునీత భర్త రాజశేఖర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు మరింత చర్చకు కారణమయ్యాయి. దీంతో...దీని పైన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. వివేకా హత్య కేసు విషయంలో సీఎం జగన్ ఏం చెప్పేవారనే దాని పైన ఆయన స్పందించారు. హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌తనకు ఎప్పుడూ చెప్పేవారని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డిల కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివని మాత్రమే సీఎం తనకు చెప్పారని అందులో వివరించారు.

అదే విషయాన్ని సునీత భర్తతోనూ చెప్పాను
సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి 2019 సెప్టెంబరులో తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. తాను డీజీపీగా ఉన్నప్పుడు ఏనాడూ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి తనను కలవలేదని సవాంగ్ స్పష్టం చేసారు. విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్న సమయంలో తాను మాట్లాడానంటూ వచ్చిన వార్తల పైన వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపైన ఉందని పేర్కొన్నారు. సునీత భర్త రాజశేఖర రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం లో చెప్పిన అంశాలు మీడియాలో వచ్చాయి. వీటి ఆధారంగా ప్రతిపక్ష టీడీపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసింది.

రాజకీయంగా విమర్శలకు కేంద్రంగా
దీని పైన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సైతం రియాక్ట్ అయ్యారు. సునీత కుటుంబ సభ్యులు చంద్రబాబు చేతిలో పావులుగా మారారా అనే అనుమానం వ్యక్తం చేసారు. అసలు సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న కొన్ని అంశాలు అంతు చిక్కనవిగా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ కు సీబీఐ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇటు సీబీఐ తమ విచారణ సమయంలో సేకరించిన సమాచారం.. వ్యక్తుల నుంచి రాబట్టిన స్టేట్ మెంట్స్ ను కోర్టుకు సమర్పించింది. దీంతో..సీబీఐ రానున్న రోజుల్లో వేయనున్న అడుగులు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతున్నాయి.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications