మనవరాలిపై రేప్, జైలు శిక్ష: యువతి హత్య
విజయవాడ: మనవరాలికు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో తాతకు పదేళ్ళుజైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా పడింది. కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించిన నేరస్తుడి సోదరునిపై నేరం రుజువుకావడంతో అతడికి మూడునెలల జైలుశిక్ష విధిస్తూ ఏలూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వై.లక్ష్మణరావు శుక్రవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - పశ్చిమగోదావరి జి ల్లా నల్లజర్ల మండలంలోని విద్యార్థిని (14) విజయవాడలో 9వ తరగతి 2013లో చదివింది. స్కూలుకు సెలవులు రావడంతో ఆ విద్యార్థినిని అమ్మమ్మ తీసుకువెళ్ళింది. అమ్మమ్మ భర్త ముప్పెన శ్రీనివాసరెడ్డి (60) ఒంటరిగా ఉన్న ఆవిద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎవరికైనా చె బితే చంపివేస్తానని బెదిరించాడు. సో దరుడు కన్నారెడ్డి (45) కూడా కేసు ను మాఫీ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేసింది.

దంపతుల దారుణ హత్య
కృష్ణా జిల్లా మువ్వ మండలం బట్లపెనుమర్రులో దారుణం జరిగింది. గత రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుల దంపతులను దారుణంగా హత్య చేసి ఇల్లును లూఠీ చేశారు. మృతులు చలసాని వీరభద్రం, వెంకటరత్నమ్మగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
యువతి హత్య
కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో యువతి దారుణహత్యకు గురైంది. కాలిన గాయాలతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న యువతి అమ్మణి(19)ని ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు.












Click it and Unblock the Notifications