జైరాంకు గ్రాండ్ వెల్‌కం, ఏం మాట్లాడతారోనని పొన్నాల

హైదరాబాద్/వరంగల్: కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్‌కు వరంగల్ జిల్లాలో కాంగ్రెసు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విశాఖ నుండి రైలులో ఆయన కాజీపేటకు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజా సారయ్య, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

ఏం మాట్లాడుతారో: పొన్నాల

అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విమర్శించారు. తెరాసను విలీనం చేయమని ఎవరూ అడగలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే బేషరతుగా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని నిండు సభల్లో ఆయనే చెప్పారన్నారు.

Grand welcome to Jairam Ramesh in Warangal

తెలంగాణను తామే తెచ్చామని కెసిఆఱ్ చెప్పుకుంటున్నాడని, 548 మంది ఉన్న పార్లమెంటులో కేవలం ఇద్దరు ఎంపీలను కలిగి ఉన్న తెరాస.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించిందో చెప్పాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు పూర్తి కాగానే కెసిఆర్ నేరుగా సోనియా గాంధీని కుటుంబసమేతంగా కలిశారని గుర్తు చేశారు. కెసిఆర్ విశ్వసనీయత అందరికీ తెలిసిందేనని, దానిపై తానేమీ వ్యాఖ్యానించనన్నారు.

కాంగ్రెస్‌దే అధికారం: డిఎస్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీదే అధికారమని శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ ధీమా వ్యక్తే చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ధీమా కార్యకర్తల్లో ఉందన్నారు. కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+