వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరెస్ట్: పూర్ణ, ఆనంద్‌లకు ఘన స్వాగతం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు మాలవత్ పూర్ణ, సాదనపల్ల ఆనంద్‌లకు ఘనస్వాగతం లభించింది. ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమాన్ని ముగించుకుని ఆదివారం నగరానికి వచ్చిన వీరికి నగరవాసులు అడుగడుగునా నీరాజనం పలికారు. శంషాబాద్ నుంచి ప్రారంభమైన విజయ యాత్ర ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. పలువురు టపాసులు కాలుస్తూ.. వారికి స్వాగతం పలికారు.

పూర్ణ, ఆనంద్‌లు అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన యాత్ర ముగింపు సభలో గురుకుల పాఠశాలల సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇది ఆరంభం మాత్రమే అని ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తామని తెలిపారు. విద్యార్థి ఆనంద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ప్రవీన్ కుమార్ ఇచ్చిన ధైర్యంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించానని అన్నారు. పూర్ణ మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించడం మర్చిపోలేని అనుభూతిని అన్నారు.

ఎవరెస్ట్ శిఖరంపై భారత జాతీయ పతాకాన్ని ఎగరేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ జెండాను ఎవరెస్ట్‌పై ఎగరేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన వీరికి చాంద్రాయణగుట్ట చౌరస్తా, ఇంజన్‌బౌలి, అలియాబాద్, లాల్‌దర్వాజ, చార్మినార్ వద్ద పలు సంఘాల ఆధ్వర్యంలో వేదికలను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.

చార్మినార్ వద్ద ఆల్ ఇండియా ఎస్టి, ఎస్టి, బలహీనవర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్‌పాషా ఖాద్రి, అహ్మద్ బలాల, షాలిబండ కార్పొరేటర్ మహ్మద్ గౌస్‌లు స్వాగతం పలికి వారికి శాలువాలు కప్పి, పూలమాలలతో సన్మానించారు. పలు పాఠశాలలకు చెందిన ముస్లిం బాలికలు పూలతో వారికి స్వాగతం పలికారు.

ఘన స్వాగతం

ఘన స్వాగతం

ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు మాలవత్ పూర్ణ, సాదనపల్ల ఆనంద్‌లకు ఘనస్వాగతం లభించింది.

ఘన స్వాగతం

ఘన స్వాగతం

ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమాన్ని ముగించుకుని ఆదివారం నగరానికి వచ్చిన వీరికి నగరవాసులు అడుగడుగునా నీరాజనం పలికారు.

ఘన స్వాగతం

ఘన స్వాగతం

శంషాబాద్ నుంచి ప్రారంభమైన విజయ యాత్ర ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ప్రజలు దారి పొడగున వినూత్న రీతిలో వారికి స్వాగతాలు చెబుతూ ఆహ్వానించారు.

ఘన స్వాగతం

ఘన స్వాగతం

విద్యార్థి ఆనంద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ప్రవీన్ కుమార్ ఇచ్చిన ధైర్యంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించానని అన్నారు. పూర్ణ మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించడం మర్చిపోలేని అనుభూతిని అన్నారు.

ఘన స్వాగతం

ఘన స్వాగతం

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన వీరికి చాంద్రాయణగుట్ట చౌరస్తా, ఇంజన్‌బౌలి, అలియాబాద్, లాల్‌దర్వాజ, చార్మినార్ వద్ద పలు సంఘాల ఆధ్వర్యంలో వేదికలను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.

English summary
Malavath Poorna, the youngest girl to scale Mt. Everest along with fellow climber S. Anand Kumar (16) being welcomed at Shamshabad Airport in Hyderabad on JUne 8, 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X