వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం లాంచ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశం పీ15బీ ప్రాజెక్టు కింద ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న అధునాతన సెల్త్‌ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యుద్ధనౌకకు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నంగా నామకరణం చేయాలని నిర్ణయించారు.

ముంబైలోని మజ్గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) సంస్థ నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకను తదుపరి పనుల నిమిత్తం సోమవారం జలప్రవేశం చేయించారు. 163 మీటర్ల పొడవున్న ఈ యుద్ధ నౌకను శత్రుదేశ రాడార్లను ఏమార్చేలా సెల్త్‌ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది మూడువేల టన్నుల బరువు ఉంటుంది.

నాలుగు గ్యాస్‌ టర్బైన్లు ఉండే ఈ యుద్ధనౌక 7300 టన్నుల బరువుతోపాటు గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో అధునాతన సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు, సమాచార వ్యవస్థలను పొందుపరిచారు.

ఉపరితలం పైనుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే శతఘ్నులు (మిస్సైళ్లు), యుద్ధ విమానాలను కూడా విధ్వంసం చేసే శక్తిమంతమైన శతఘ్నులను ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు.

జలాంతర్గాములను విధ్వంసం చేసే టోర్పెడోలను కూడా ఈ యుద్ధనౌక నుంచి ప్రయోగించవచ్చు. 2018 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక డిజైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది.

విశాఖ

విశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఐఎన్‌ఎస్‌ లాంచ్‌కు ముందు తీరంలో ఇలా...

విశాఖ

విశాఖ

ముంబైలోని మజ్గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) సంస్థ నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకను తదుపరి పనుల నిమిత్తం సోమవారం విశాఖలో జలప్రవేశం చేయించారు.

విశాఖ

విశాఖ

163 మీటర్ల పొడవున్న ఈ యుద్ధ నౌకను శత్రుదేశ రాడార్లను ఏమార్చేలా సెల్త్‌ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది మూడువేల టన్నుల బరువు ఉంటుంది.

విశాఖ

విశాఖ

నాలుగు గ్యాస్‌ టర్బైన్లు ఉండే ఈ యుద్ధనౌక 7300 టన్నుల బరువుతోపాటు గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.

విశాఖ

విశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఐఎన్‌ఎస్‌ లాంచ్ సందర్భంగా భారీగా చేరిన జనాలు.

విశాఖ

విశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఐఎన్‌ఎస్‌ లాంచ్ సందర్భంగా చూసేందుకు భారీగా చేరిన జనాలు. ఉదయం దీనిని జల ప్రవేశం చేయించారు.

English summary
great honour to Vishakapatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X