వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ .. తెలంగాణా థియేటర్స్ యాజమాన్యాలకు బిగ్ రిలీఫ్.. రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ లలో బొమ్మ పడనుందా? తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లను నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నిర్వహించకపోకోవడానికి ఏపీ కారణమా? ఏపీ థియేటర్లకు, తెలంగాణ థియేటర్లకు లింక్ ఉందా ? టాలీవుడ్ సినీ పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ ఒకటే ఉండటం అందుకు కారణమా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు .. కేంద్రం పదేపదే చెప్పటానికి కారణాలు ఇవే !!కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు .. కేంద్రం పదేపదే చెప్పటానికి కారణాలు ఇవే !!

యేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం

యేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా నిబంధనలతో సినిమా హాల్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు మరియు ఫంక్షన్ హాల్స్ ను తెరవడానికి అనుమతి ఇచ్చింది. థియేటర్ల నిర్వహణపై సందిగ్ధంలో ఉన్న తెలంగాణా ప్రాంత థియేటర్ల యాజమాన్యాలకు ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాస్త ఊరటనిచ్చింది.

కరోనా నిబంధనలు పాటిస్తూనే థియేటర్ల నిర్వహణ

కరోనా నిబంధనలు పాటిస్తూనే థియేటర్ల నిర్వహణ

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో లాక్ డౌన్ ప్రకటించిన ఏపీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు కర్ఫ్యూను సడలించింది. ఇక తాజాగా థియేటర్ల నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ప్రజలు శానిటైజర్‌ను ఉపయోగించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని , సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది. సీట్ల మధ్య ఖాళీ ఉండేలా చూడాలని, కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, శానిటైజేషన్ తప్పనిసరిగా చేయాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు.

 8వ తేదీ నుండి థియేటర్లు రీ ఓపెన్

8వ తేదీ నుండి థియేటర్లు రీ ఓపెన్

ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు 8వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. సినిమా హాల్స్ 8వ తేదీ నుండి తెరుచుకోనున్నాయి. కోవిడ్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్ల వద్ద ఎక్కువగా జనం రద్దీగా ఉండకుండా చూడాలని, సినిమా టికెట్ల కౌంటర్ల వద్ద కూడా జనం గుమికూడి కాకుండా భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. కరోనా నిబంధనలను అమలు చేయని థియేటర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో జిమ్ లు, ఫంక్షన్ హాల్స్ లోనూ కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

 ఏపీ ప్రకటనతో తెలంగాణాలోనూ థియేటర్ల నిర్వహణకు సిద్ధం అవుతున్న యాజమాన్యాలు

ఏపీ ప్రకటనతో తెలంగాణాలోనూ థియేటర్ల నిర్వహణకు సిద్ధం అవుతున్న యాజమాన్యాలు

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా థియేటర్ల ప్రారంభం పై సందిగ్దత నెలకొంది. ప్రభుత్వం థియేటర్లు నిర్వహించుకోవచ్చని ప్రకటించినా కొత్త సినిమాల రిలీజ్ లేకపోవటంతో తెలంగాణలో థియేటర్లు ప్రారంభం కాలేదు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో స్పష్టత వచ్చినట్లయింది. తెలంగాణలో లాక్ డౌన్ తొలగింపుతో థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతి లభించగా, కొత్త సినిమాలు విడుదల చేయడం కోసం ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపించలేదు.

 రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లింక్ ఇదే

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లింక్ ఇదే

ఏపీలో థియేటర్ల బంద్ కొనసాగుతున్న సమయంలో సినిమా రిలీజ్ చేయడానికి వెనకడుగు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా అప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే సినిమాలు తెలుగు భాష చిత్రాలే కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు మధ్య కచ్చితంగా లింక్ ఉండి తీరుతుంది.ఈ లింక్ తెలంగాణా థియేటర్ల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా థియేటర్లకు అనుమతి లభించడంతో తెలంగాణాలో కూడా థియేటర్లను నిర్వహించాలని భావిస్తున్నారు. కొత్త సినిమాలు విడుదల చేయడానికి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లను నిర్వహించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.

Recommended Video

Megastar Chiranjeevi చిక్కుతారా.. చిక్కుల్లో పెడతారా.. ఈసారి ఆచితూచి..!!
రెండు తెలుగు రాష్ట్రాలు థియేటర్స్ రీ ఓపెన్ ... కొత్త సినిమాల విడుదలకు రెడీ

రెండు తెలుగు రాష్ట్రాలు థియేటర్స్ రీ ఓపెన్ ... కొత్త సినిమాల విడుదలకు రెడీ

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూవీ మేకర్లు కొత్త సినిమాలను తెరకెక్కించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని థియేటర్ల యాజమాన్యాలు సైతం ఊపిరి పీల్చుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనప్పటికీ రెండు రాష్ట్రాలలోనూ ఒకే సినిమాలు రిలీజ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ థియేటర్లు నిర్వహించుకోవచ్చని ఓకె ప్రభుత్వం ఓకే చెప్పినా , ఏపీలో గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో తటపటాయించారు. ఇక తాజాగా ఏపీ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగు సినిమాకు తెరతీసినట్టు అయింది. దీంతో రెండు తెలుగురాష్ట్రాల్లో థియేటర్లలో బొమ్మ పడనుంది .

English summary
The Andhra Pradesh state government has taken a key decision as part of the ongoing curfew easing in Andhra Pradesh as part of corona control measures. The Jagan Mohan Reddy government has given permission to open cinema halls, restaurants, gyms and function halls with corona regulations. The decision taken by the AP government has come as a big relief to the theater owners in Telangana who are in a dilemma over the theaters re open.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X