వేరుగా.. పండగ చేస్కోండి!: ఏపీ-టీలకు మోడీ, ఆంధ్రా అన్నదమ్ములని కేటీఆర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధి పథకంలో దూసుకు వెళ్లాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఆయన ట్విట్టర్‌లో సందేశాలను పోస్ట్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రజలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

తెలంగాణ ప్రజలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకెళ్లాలని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఆయన సోదర, సోదరీమణులు అంటూ తన సందేశంలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పోస్ట్ చేశారు.

Greetings & good wishes to my sisters & brothers of AP and Telangana

ఆంధ్రా అన్నదమ్ములకు అభినందనలు: కేటీఆర్

ఆంధ్రా అన్నాదమ్ములు, సోదరీమణులకు తన అభినందనలు అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అభివృద్ధి చెందిన ఐదు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు.

బీజేపీ ఆఫీస్‌లో ఆవిర్భావ వేడుకలు

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు.

కేసీఆర్ త్యాగ ఫలమే: కవిత

కేసీఆర్ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం అని కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పాలనతో బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు. నిరంతర విద్యుత్ కేసీఆర్ పాలనకు నిదర్శనం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+