పెళ్లికి ముందే టెక్కీ వరుడు పరార్, చితకబాదిన వైనం

ఈ సమయంలో అనూహ్యంగా వరుని అదృశ్యంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. చివరకు పెండ్లి కుమారుడు రాలేడని నిర్ధారించుకున్న వధువు బంధువులు వరుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నానంటూ రామకృష్ణపురంకు చెందిన విజయ్ రెడ్డి గజ్వేల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుమార్తెతో నెల క్రితం వివాహం నిశ్చయం చేసుకున్నాడు. అయితే కట్నకానుకల క్రింద రూ.20లక్షలు ఇవ్వడానికి వధువు కుటుంబ సభ్యులు అంగీకరించి అప్పుడే రూ.7.50లక్షలు అప్పజెప్పారు.
ఈ క్రమంలో డిసెంబర్ 19న ఎంగేజ్‌మెంట్ చేసుకోగా, ఈ నెల 9న వివాహ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కట్నం డబ్బుల, బంగారు వస్తువుల కోసం మొదటగా వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నిక, ఇతర బంధువులు గజ్వేల్ చేరుకున్నారు.
పెళ్లి సమయం దగ్గర పడుతున్నప్పటికీ వరుడు రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు వారిని నిలదీయడంతో అడ్డదిడ్డంగా సమాధానం ఇచ్చారు. వారు సైతం పరారవడానికి సిద్ధమవుతున్న తరుణంలో పెండ్లివారు పట్టుకొని చితకబాదడంతోపాటు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బాధితులు గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications