అనంతపురంలో వింత: బోరు వేయకుండా ఊబికి వచ్చిన నీళ్లు!
అనంతపురం జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని గుంగోడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస ఆచారి పొలంలో బోరు వేయగా విద్యుత్ మోటార్ అవసరం లేకుండా నీరు ఉబికి వచ్చ
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని గుంగోడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస ఆచారి పొలంలో బోరు వేయగా విద్యుత్ మోటార్ అవసరం లేకుండా నీరు ఉబికి వచ్చింది.
ఈ వింత జరిగి నెల రోజులు కూడా గడవక ముందే ఇలాంటి ఘటనే జిల్లాలో మరొకటి చోటు చేసుకుంది. అయితే ఇది ఎవరి ప్రమేయం లేకుండా జరగడం గమనార్హం. బోర్ వేయకుండానే నీళ్లు ఉబికి వచ్చాయి.

చిలమత్తూరు మండలం గొల్లపల్లిలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో గొల్లపల్లిలో నారాయణప్పకు చెందిన బావిలో పిడుగు పడింది.
ఆ బావి ముప్పై ఎల్లుగా ఎండిపోయి ఉంది. పిడుగు పడటంతో ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. అటువైపు వెళ్తున్న గ్రామస్తులు బావిలో ఉబికి వస్తున్న నీటిని చూసి ఆశ్చర్యపోయారు. వింతను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications