• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీలో పొన్నూరు పంచాయితీ .. వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు గుస్సా

|

ఏపిలో వైసిపి సర్కార్ ఏర్పడి రెండు నెలల కాలం అయింది. ఈ రెండు నెలల్లో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ ఎంత దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేసినా సమస్యలు జగన్ ను అడుగడుగునా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అప్పుల రాష్ట్రంగా ఉన్న ఏపీని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అడుగడుగున ఎదురవుతున్న అవాంతరాలు జగన్ ప్రయత్నాలను ఒక అడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కు లాగేంతగా మారిపోయాయి. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష ఇలా చాలా విషయాల్లో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గ్రూపు రాజకీయాలు .. జగన్ కు తలనొప్పిగా మారిన పంచాయితీలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గ్రూపు రాజకీయాలు .. జగన్ కు తలనొప్పిగా మారిన పంచాయితీలు

ఈ సమస్యలు ఇలా ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న నేతల తీరుతో జగన్‌కు పార్టీలో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. పార్టీలో ఉన్న నేతలు ఒకరికొకరు పొసగక తగవులకు దిగుతున్నారు. అందరూ ఒకటి గా ఉండి కలిసి పని చేయాల్సిన చోట గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది జగన్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు తగాదాల వల్ల పార్టీకి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం కనిపిస్తోంది.

 ఎన్నికల ముందు టికెట్ కోసం మొదలైన చిచ్చు .. ఇంకా కొనసాగుతున్న ఘర్షణ

ఎన్నికల ముందు టికెట్ కోసం మొదలైన చిచ్చు .. ఇంకా కొనసాగుతున్న ఘర్షణ

గతంలో పొన్నూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అలాంటి పొన్నూర్ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కిలారి రోశయ్య విజయం సాధించారు. అయితే ఆయన ముందుగా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అందరూ భావించినా చివరికి అధిష్టానం ఆయనను పొన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. దీంతో ఎన్నికలకు ముందే పొన్నూరు వైసీపీలో పెద్దఎత్తున రగడ జరిగింది. కిలారి రోశయ్యకు పొన్నూరు టికెట్ ఇవ్వడంతో పొన్నూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. సమన్వయకర్త రావి వెంకటరమణకు టికెట్ రాకపోవడంపై కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తూ... పొన్నూరు మున్సిపల్ కౌన్సిలర్లు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజీనామా చేశారు.

ఎన్నికల్లో సహకరించలేదని వెంకటరమణ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టిన ఎమ్మెల్యే రోశయ్య

ఎన్నికల్లో సహకరించలేదని వెంకటరమణ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టిన ఎమ్మెల్యే రోశయ్య

పార్టీ మారతారని అందరూ భావించారు కానీ తర్వాత పార్టీలోని ముఖ్య నాయకుల బుజ్జగింపుతో వెంకటరమణ పార్టీ మారలేదు.

అయితే ఎన్నికల సమయంలో తన గెలుపు కోసం రావి అనుచరులు తమకు మద్దతు తెలపలేదని కిలారి రోశయ్య ఇప్పుడు పార్టీ శ్రేణులను పక్కన పెట్టారు. ఎన్నికలలో తమకు వ్యతిరేకంగా పనిచేశారని వీరిని పూర్తిగా పట్టించుకోవటం లేదట రోశయ్య. దీంతో పార్టీలో రెండు వర్గాలుగా ఏర్పడి అంతర్గత కుమ్ములాట నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే స్థానికంగా ఏ కార్యక్రమం జరిగినా వెంకట రమణ వర్గానికి చెప్పటం లేదు. దీంతో పొన్నూరు లో ఇరు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భాగ్గుమంతుంది. వీరి గొడవతో క్యాడర్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ అంతర్గత కుమ్ములాట కు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Group politics in Ponnur constituency is causing damage to YCP. The Venkata Ramana and his followers, who was disappointed in the election, won the ticket for the incompetence, but the Kilari Roshaiah and team worked hard to win with out local cadre support . Every initiative of MLA Roshaiah is being completely shunned by Venkata Ramana. This has caused concern among the Ponnur YCP lines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more