ఎన్నికల వేళ- ఏపీలో..!!

GST March 2024 collections: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. మార్చిలో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ రెవెన్యూ నమోదైంది. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 11.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

మార్చిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1.78 లక్షల కోట్ల రూపాయలు. 2024లో ఇదే మార్చి నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య 11.5 శాతం అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకంది.

GST revenue for March 2024 registed as Rs 1 78 lakh crore AP posts Rs 4082 cr

ఇందులో సీజీఎస్టీ వాటా 34,532 కోట్లు, ఎస్‌జీఎస్టీ- 43,746 కోట్లు, ఐజీఎస్టీ- 87,947 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 40,322 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 12,259 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 996 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.

ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల ఏకంగా 16 శాతంగా నమోదైంది. అంటే గత ఏడాది మార్చిలో ఏపీలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 3,532 కోట్ల రూపాయలు.. కాగా ఇప్పుడు ఈ సంఖ్య 4,000 కోట్ల రూపాయలను అధిగమించింది. 4,082 కోట్ల రూపాయలుగా నమోదైంది. తెలంగాణతో పోల్చుకుంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 12 శాతం.

రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.601 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.852 కోట్లు, పంజాబ్-రూ.2,090 కోట్లు, చండీగఢ్-రూ.238 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,730 కోట్లు, హర్యానా-రూ.9,545 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-రూ.5,820 కోట్లు, రాజస్థాన్-4,798 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.

ఉత్తర ప్రదేశ్-రూ.9,087 కోట్లు, బిహార్-రూ.1,991 కోట్లు, సిక్కిం-రూ.303 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.168 కోట్లు, నాగాలాండ్-రూ.83 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. మణిపూర్-రూ.69 కోట్లు, మిజోరం-రూ.50 కోట్లు, త్రిపుర-రూ.121 కోట్లు, మేఘాలయ-రూ.213 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లను అందుకున్నాయి.

అస్సాం-రూ.1,543 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.5,473 కోట్లు, జార్ఖండ్-రూ.3,243 కోట్లు, ఒడిశా-5,109 కోట్లుగా రికార్డయ్యాయి. ఛత్తీస్‌గఢ్- 3,143, మధ్యప్రదేశ్-రూ.3,974 కోట్లు, డయ్యూ డామన్/దాద్రానగర్ హవేలి-రూ.452 కోట్లు, గుజరాత్-11,392 కోట్లు రికార్డయ్యాయి.

మహారాష్ట్ర-రూ.27,688 కోట్లు, కర్ణాటక-రూ.13,014 కోట్లు, గోవా-రూ.565 కోట్లు, కేరళ-రూ.2,598 కోట్లు, తెలంగాణ- రూ.5,399 కోట్లు, తమిళనాడు-రూ.11,017 కోట్లు, పుదుచ్చేరి-రూ.221 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.32 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+