"విశాఖలో లోకేష్ భూదందా.. వెయ్యి కోట్ల విలువైన భూముల్ని కబ్జా!"
విశాఖపట్నం : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ భూ దందాలకు పాల్పడుతున్నారంటూ విశాఖ వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్.

విశాఖలోని సర్య్యూట్ హౌజ్ సమీపంలో ఉన్న వెయ్యి కోట్ల విలువైన భూములను లోకేష్ కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోబోమన్న తరహాలో కామెంట్స్ చేసిన అమర్నాథ్.. కబ్జాలకు పాల్పడేవారిపై వైసీపీ పోరాడుతుందని తెలిపారు. మరి లోకేష్ పై చేసిన ఈ వ్యాఖ్యలకు టీడీపీ ఎలా స్పందిస్తుందన్నేది వేచి చూడాలి. లోకేష్ పై ఆరోపణలను స్థానిక టీడీపీ నేతలు తిప్పికొడుతారా లేక చూసీ చూడనట్టు వదిలేస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.












Click it and Unblock the Notifications