వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గజల్‌ శ్రీనివాస్‌కు గుజరాత్‌ సిఎం అభినందన

|
Google Oneindia TeluguNews

Gujarat CM praises Ghazal Srinivas
హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు, డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌‌ను గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ అభినందించారు. ఆలయాలు, గోపరిరక్షణ, గంగానది ప్రక్షాళన కోసం గజల్‌ శ్రీనివాస్‌ చేస్తున్న కృషిని గుజరాత్ సిఎం ఆనందిబెన్‌ పటేల్‌ ప్రశంసించారు.

గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌, సేవ్‌ టెంపల్స్‌ డాట్‌ ఓఆర్‌జీ కోసం శ్రీనివాస్‌ హిందీలో రూపొందించిన ‘మందిర్‌' ఆల్బంను ఆమె అభినందించారు. సనాతనధర్మం, హిందూ సంస్కృతి ప్రచారం కోసం శ్రీనివాస్‌ చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఆనందిబెన్‌ పటేల్‌ అభినందన తనకు ఎంతో ప్రేరణ, ప్రోత్సాహంగా ఉందని గజల్ శ్రీనివాస్ తెలిపారు.

తెలుగు సంస్కృతి డిజిటలీకరణ: కేంద్రమంత్రి సుజన

న్యూఢిల్లీ: భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను డిజిటలైజ్‌ చేసేందుకు ఉద్దేశించిన ‘డిజిటల్‌ ఇండియా హెరిటేజ్‌' ప్రాజెక్టు మంచి ప్రయత్నమని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూశాస్త్ర శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఇండియా హాబిటేట్‌ సెంటర్‌లో ఈ ప్రాజెక్టుపై వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. వేదాల్లోని మంత్రాలకు చాలామందికి అర్థాలు తెలియటం లేదని, ఆ మంత్రం చరిత్ర, దానివల్ల జరిగే మేలు తెలియజేస్తే రాబోయే తరానికి వాటిపై చాలా ఆసక్తి పెరుగుతుందని అన్నారు.

అలాగే, పెద్దలను ఎందుకు గౌరవించాలి? తల్లీ, తండ్రీ, గురువు దైవంతో సమానం అని ఎందుకు అంటారు? దానికి మూలాలేంటి? అనే ఎన్నో అంశాలపై ఈ ప్రాజెక్టులో భాగంగా డిజిటలీకరణ జరుగుతుందదని ఆయన వివరించారు. ప్రస్తుతం హంపి విశేషాలు, సంస్కృతిపై ప్రాజెక్టు మొదలయ్యిందని చెప్పారు.

త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక సంపద, సంస్కృతీ, సంప్రదాయాలను కూడా డిజిటలీకరించేందుకు తాను చొరవ తీసుకుంటానన్నారు. తెలంగాణలోని చార్మినార్‌, గోల్కొండ కోట, వరంగల్‌, ఆంధ్రాలోని విజయనగరం, అమరావతి స్థూపాలు, తిరుమల ఏడు కొండలు మొదలైన వాటిపైన కూడా డిజిటల్‌ ప్రాజెక్టులు మొదలవుతాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు.

English summary
Dr Ghazal Srinivas who is now on a mission of Ganga Sudh and Gomata Samrakshan has received a pat from Smt. Anandiben Patel, the Chief Minister of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X