టీడీపీ నేత కారులో గన్, బుల్లెట్లు- వారిని తరమండ్రా.. అంటూ రెచ్చగొట్టిన చంద్రబాబు
రాయచోటి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తగా.. ఇప్పుడు తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో అలాంటి వాతావరణమే నెలకొంది.
నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు గ్రామానికి చేరుకున్నప్పుడు చంద్రబాబు రోడ్ షోను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ఎగురవేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పరం బాహాబాహికి దిగారు. దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలతో రెండు పార్టీలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి.
పరిస్థితి చేయి దాటిపోతోండటంతో పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ- వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టారు. పారా మిలటరీ బలగాలపైనా రాళ్లు విసిరారు.
ఈ పరిణామాలతో పుంగనూరు రణరంగంగా మారింది. రాళ్ల దాడిలో పలువురు పోలీసులూ గాయపడ్డారు. వారికి స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. గాయపడ్డ కానిస్టేబుళ్లు, ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీసులను అన్నమయ్య రాయచోటి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. సంఘటన ఎలా జరిగిందని ఆరా తీశారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. వారికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని, కొందరు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడామని చెప్పారు. పుంగనూరు టౌన్‌లో రోడ్ షో నిర్వహించేలా ముందస్తు ప్రణాళికలో లేదని, రోడ్ షోను జాతీయ రహదారి మీదుగా చిత్తూరుకు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని వివరించారు.

హఠాత్తుగా టీడీపీ నాయకులు.. ఈ రోడ్ షోను టౌన్‌లోకి వచ్చేలా చేశారని చెప్పారు. వారి వద్ద బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో పుంగనూరు జాతీయ రహదారికి చేరుకున్నారనడానికి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. వాటి ఆధారంగా ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని తేల్చి చెప్పారు.
కాగా- తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడి కారులో పోలీసులు గన్, బుల్లెట్లను గుర్తించడం కలకలం రేపుతోంది. దాడికి పాల్పడాలనే ఉద్దేశంతోనే వారు గన్, బుల్లెట్లను తమ వెంట తెచ్చుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. తరమండ్రా వాళ్లను.. అంటూ చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications