దంపతులపై కాల్పులకు తెగబడ్డ దుండగులు: ఎవరై ఉంటారు?
ఏలూరు: బైక్‌పై వెళ్తున్న దంపతులపై కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.పెనుమంట్ర మండలం మార్టేరు వద్ద నాటు తుపాకులతో కొంతమంది వారిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

కాల్పుల సమయంలో.. భర్త శ్రీనివాసరెడ్డి పారిపోగా, భార్య ధనలక్ష్మిపై దుండగులు హత్యాయత్నం చేశారు. శ్రీనివాస రెడ్డి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు హుటాహుటిన అక్కడికి వచ్చారు. దీంతో దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం ధనలక్ష్మిని విజయవాడధనలక్ష్మిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పుల వెనుక కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. శ్రీనివాసరెడ్డి శత్రువులు ఎవరైనా కాల్పులకు పాల్పడి ఉంటారా?, లేక డబ్బు లేదా నగల కోసం ఏదైనా ముఠా ఈ దారుణానికి పాల్పడిందా? అన్న దానిపై వారు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications