గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చికెన్ ముక్కా మజాకా: వెన్నెముక బాగంలో ఇరుక్కొన్న చికెన్ ముక్కను తీసిన వైద్యులు

ఓ మహిళ గొంతులో ఇరుక్కుపోయిన నాటుకోడి ఎముకను గుంటూరు వైద్యులు శస్త్రచికిత్స చేయకుండానే తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగా ఉందని వైద్యులు ప్రకటించారు.తొలుత గొంతులో ఇరుక్కొన్న ఎముక, వెన్నెముక ముందు భ

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఓ మహిళ గొంతులో ఇరుక్కుపోయిన నాటుకోడి ఎముకను గుంటూరు వైద్యులు శస్త్రచికిత్స చేయకుండానే తొలగించారు.తొలుత గొంతులో ఇరుక్కొన్న ఎముక, వెన్నెముక ముందు భాగంలోకి జారిపోయింది. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

గుంటూరుకు చెందిన నాగమణి అనే మహిళ గురువారం రాత్రి పూట నాటుకోడి మాంసంతో భోజనంచేసింది.అయితే ఆ సమయంలో ఆమె గొంతులో నాటుకోడి ఎముక ఇరుక్కుపోయింది. దీంతో ఆమెకు నీరు తాగడం అన్నం తినడానికి కష్టంగా మారింది.

chicken bone

దీంతో ఆమె గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించింది.దీంతో ఆమెను ఈఎన్ టీ విభాగానికి తీసుకువచ్చారు. ఆచార్య శాంతయ్య నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఎండోస్కోపి సాయంతో ఆమె శరీరంలో నాటుకోడి ఎముక ఎక్కడ ఉందో గుర్తించారు.

నోటి ద్వారా కెమెరా గొట్టాన్ని పంపారు. సాధారణంగా మెడ వద్ద శస్త్రచికిత్స చేసి ఈ ఎముకను తీస్తారు. కాని, శస్త్రచికిత్స చేయకుండానే ఆమె గొంతునుండి వెన్నుపూస ముందుభాగంలోని కణజాలంలో ఇరుక్కుపోయిన నాటుకోడి ఎముకను తొలగించారు.

ముక్కులో కణితి తొలగింపు

కృష్ణా జిల్లా నందిగామకు చెందిన పద్మావతికి ముక్కులోపల ఎడమ వైపు పెద్ద కణితి ఏర్పడింది. ఈఎన్ టీ విభాగానికి చెందిన వైద్యులు క్యాథ్ ల్యాబ్ కు తరలించి కణితి వద్ద రక్తప్రసరణ నిలిపివేసి కణితిని తొలగించారు.

English summary
Guntur doctor removed chicken bone from a lady body. Nagamani, who is suffering from throat problem from three days, when she was eating chicken,struck in the throat.Dr.Shantaiah team removed bone from her body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X