అమరావతి భూదందా: సాక్షి కథనాల వెనుకున్న ఆ గుంటూరు ఎమ్మెల్యే ఎవరు?
అమరావతి: ఏపీలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'తో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. డబ్బులు, పదవులను ఎరగా చూపి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుంటున్నారని స్వయాన ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు.
పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల్లో అక్రమంగా సంపాదించిన కొన్ని వేల కోట్ల రూపాయలను వైసీపీని దెబ్బతీయడానికి వినియోగిస్తున్నారంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరికొందరు అయితే టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' అనేది కొత్త స్ట్రాటజీగా అభివర్ణించారు.

మరికొందరు మాత్రం ఒక్కొక్కరు పది ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం లేకుండా టీడీపీలోకి ఎందుకు చేరతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అమరావతి భూదందాలో రైతులను మోసం చేస్తున్నారంటూ వరుస కథనాలను ప్రచురించింది.
ఈ వరుస కథనాల వెనుక గుంటూరుకు చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడని సమాచారం. అయితే అమరావతి భూదందాలు బయటకు రావడంలో కీలకంగా ఉన్న ఆ ఎమ్మెల్యేను కొనేయడానికి టీడీపీ ప్రయత్నించినట్లు సమాచారం. ఆ ఒక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు టీడీపీ నేతలు ఎమ్మెల్యే మామ ద్వారా రూ. 150 కోట్లు ఆఫర్ చేశారని ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ పుకారు తాజాగా హల్‌చల్ చేస్తుంది.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆర్థికంగా బాగా సంపన్నుడు. సాక్షి ప్రచురించి కథనాల్లో కీలక సమాచారాన్ని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఇచ్చాడని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే తన సొంత డబ్బు ఖర్చు పెట్టి, డాక్యుమెంట్లు మొత్తం సంపాదించారని వాటిని దగ్గరుంచుకుని సాక్షి వరుస కథనాలను ప్రచురించిందంటున్నారు. సాక్షి ప్రచురించిన ఈ వరుస కథనాలతో టీడీపీ ప్రభుత్వంతో పాటు మంత్రులకు కూడా చెమటలు పట్టాయి.

అమరావతి భూదందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, తెలుగుదేశం పార్టీ నేతలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు. మరికొందరు అమరావతిలో తాము భూములు కొన్నట్లు అంగీకరించారు. ఈ క్రమంలో అమరావతి భూదందాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఆ ఎమ్మెల్యేను పార్టీ చేరాలంటూ టీడీపీ సంప్రదించినట్లు సమాచారం.
అంతేకాదు ఆర్ధికంగా, రాజకీయంగా బలంగా ఉన్న ఆ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి చేరితే 150 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. టీడీపీ డబ్బు ఆఫర్ చేసిన విషయాన్ని అధినేత జగన్‌కు చెప్పేందుకు సదరు ఆ ఎమ్మెల్యే లోటస్ పాండ్‌కు వచ్చారట. టీడీపీ ఆఫర్ చేసిన మొత్తాన్ని అధినేత జగన్‌కు వివరించాడట.
అయితే ఎమ్మెల్యే చెప్పిన మాటలు సావధానంగా విన్న జగన్ వెరైటీగా "డబ్బు వస్తోంటే వద్దనడం ఎందుకు.. తీసుకుని పార్టీ మారిపో అన్నా నువ్వు మన వాడివి ఎక్కడ ఉంటే ఏముంది!" అని అన్నాడుట. జగన్ వ్యాఖ్యలతో ఖంగు తిన్న సదరు ఎమ్మెల్యే " లేదు లేదు పార్టీ మరే ఉద్దేశం నాకు లేదు.. ఊరికే మీకు సమాచారం చెప్పేందుకే వచ్చా" అని అన్నాడట.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications