వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఒక్క రూపాయి ఇవ్వదు, టైమ్ పాస్ చేస్తోంది, కాంగ్రెస్‌కు పట్టిన గతే: రాయపాటి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:బడ్జెట్ సమావేశాల్లో టైమ్ పాస్ చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శించారు.

'బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు''బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు'

ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినట్టే బిజెపి కూడ అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి పడుతోందని రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనందుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనం

ఏపీ రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవనే కారణంగా టిడిపి ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసి ఆ రాష్ట్రంలో డిపాజిట్లు కూడ కోల్పోయిన విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కామినేని అసహనం, 'బడ్జెట్‌పై తప్పుడు ప్రచారం'సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కామినేని అసహనం, 'బడ్జెట్‌పై తప్పుడు ప్రచారం'

ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని చెప్పారు. టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరాలు న్యూఢిల్లీలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.

బిజెపి టైమ్‌పాస్ చేస్తోంది

బిజెపి టైమ్‌పాస్ చేస్తోంది


బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపుల విషయమై తాము ఆందోళనలు చేస్తున్న బిజెపి నాయకత్వానికి చీమ కుట్టినట్టు కూడ లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు.బడ్జెట్ సమావేశాల వరకు బిజెపి టైమ్‌పాస్ చేస్తోందని రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు బిజెపి కాలాన్ని వెళ్ళదీసే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి

కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి

2014లో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారనినర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గుర్తు చేశారు. ఏపీకి కూడ బిజెపి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని రాయపాటి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బిజెపికి కూడ పట్టనుందన్నారు.

ఒక్క రూపాయి కూడ ఇవ్వరు

ఒక్క రూపాయి కూడ ఇవ్వరు

బిజెపి ఏపీ రాష్ట్రాననికి ఒక్క రూపాయి కూడ ఇవ్వరని నర్సరావుపేటఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. బిజెపి నేతలు డ్రామాలు ఆడుతున్నారని రాయపాటి విమర్శలు గుప్పించారు. కాలం వెళ్ళదీయడమే బిజెపి నేతలు పనిగా పెట్టుకొన్నారని చెప్పారు.ఏపీకి నిధులు ఇవ్వకూడదని బిజెపి నేతలు చెప్పారని రాయపాటి అభిప్రాయపడ్డారు.

బిజెపికి ఒక్క శాతం ఓట్లు కూడ రావు

బిజెపికి ఒక్క శాతం ఓట్లు కూడ రావు


ఏపీకి నిధులు ఇవ్వకుండా బిజెపి నేతలు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తే బిజెపికి ఉన్న ఒక్కటి రెండు శాతం ఓటు బ్యాంకు కూడ నష్టపోయే అవకాశం ఉందని రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు ఆందోళన కొనసాగిస్తామని రాయపాటి సాంబశివరావు చెప్పారు.

బిజెపితో పొత్తుపై బాబు కీలక నిర్ణయం

బిజెపితో పొత్తుపై బాబు కీలక నిర్ణయం

బిజెపితో పొత్తును కొనసాగించాలా వద్దా అనే విషయమై ఈ ఏడాది చివరి వరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉందని రాయపాటి సాంబశివరావు చెప్పారు. బిజెపితో తాడోపేడో తేలనుందన్నారు.

English summary
Narsaraopeta MP Rayapati Sambhasiva Rao sensational comments on Bjp on Tuesday at New delhi. Chandrababu naidu will take a decission on alliance with Bjp in 2019 elections soon he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X