గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ కు సీమలో కొత్త స్టాప్ లు..! రేపటి నుంచే..!
ఏపీలోని గుంటూరు (guntur) నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అలర్ట్ జారీ చేసింది. గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో రెండు కొత్త హాల్ట్ లను ప్రయోగాత్మకంగా కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటిని కూడా రాయలసీమ ప్రాంతంలోని రెండు స్టేషన్లలో కల్పిస్తున్నారు. దీంతో సీమ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఇది ఉపయోగపడనుంది.
గుంటూరు నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైళ్లు (నంబర్లు 17261/17262)కు రాయలసీమలోని కడప జిల్లా జమ్మలమడుగు, నంద్యాల జిలా కోయిలకుంట్లలో హాల్ట్ ఇవ్వాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్టేషన్లలోనూ ప్రయోగాత్మకంగా హాల్ట్ లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి కూడా తెస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన చేశారు.

Experimental Stoppages Introduced 🚆
— South Central Railway (@SCRailwayIndia) February 7, 2026
To facilitate passengers, SCR is providing experimental stoppages for Train Nos. 17261/17262 (Guntur–Tirupati–Guntur) at Jammalamadugu & Koilakuntla with effect from 08 Feb 2026.#PassengerConvenience #SouthCentralRailway pic.twitter.com/wfeDfGlt3U
గుంటూరు-తిరుపతి-గుంటూరు రైలుకు రేపటి నుంచి జమ్మలమడుగు, కోయిలకుంట్లలో కల్పిస్తున్న అదనపు స్టాప్ లను ప్రస్తుతానికి ఆరునెలల పాటు ప్రయోగాత్మకంగానే ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంటే ఆయా స్టేషన్లలో ప్రయాణికుల ట్రాఫిక్ ను ఆరు నెలల పాటు అంచనా వేసి ఆ తర్వాత ఫర్వాలేదనుకుంటే వీటిని కొనసాగిస్తారు. లేకపోతే వీటిని తొలగించే అవకాశం కూడా ఉంటుందన్న మాట. కాబట్టి ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications