గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోటళ్లు: గుంటూరుకు కళ, బాబుకి 'దొనకొండ' ఆఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur to turn hospitable; Health sector hub to develop in area
హైదరాబాద్: రాజధాని నేపథ్యంలో ఎంపికైన ప్రాంతం కళకళలాడుతోంది. అక్కడ కొత్త శోభ కనిపిస్తోంది. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కార్ల షోరూంలు, పెద్ద పెద్ద హోటళ్లు, ద్విచక్ వాహనాల షోరూంలు వస్తున్నాయి. రాజధానికి సమీపాన ఉండటంతో ఎక్కడెక్కడి వారూ గుంటూరుకు వరుస కడుతున్నారు.

వ్యాపార విస్తరణకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరికొందరు అప్పుడే నూతన భవంతులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆరోగ్య, ఆతిథ్య రంగాలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రముఖ కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రమేష్ హాస్పిటల్స్, అపోలో తదితరాలు గుంటూరులో భవన నిర్మాణాలు చేపట్టబోతున్నాయట.

ఆతిథ్య రంగం కూడా గుంటూరుపై కన్నేసింది. గుంటూరులో ఎన్నో హోటళ్ళు ఉన్నా ఫైవ్‌స్టార్ హోటళ్ళు లేవు. ఆ కొరతను ప్రముఖ చైన్ హోటళ్ళ సంస్థ ఐటిసీ తీర్చబోతోంది. ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి ఐటిసి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రాజధాని నిర్మాణానికి తుళ్ళూరు మండలంలో పలు గ్రామాల రైతుల నుంచి వ్యతిరేకత ప్రబలుతున్న నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపి కరణం బలరాం కృష్ణమూర్తి నాయకత్వంలో ప్రకాశం జిల్లా రైతులు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు.

తుళ్ళూరులో రైతులను ఇబ్బంది పెట్టవద్దని వారు కోరారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వ భూమి 60 వేల ఎకరాలు సిద్ధంగా ఉందని, ఇందులో 25 వేల ఎకరాలను ఇప్పటికే పరిశ్రమల కోసం కేటాయించారంటూ గుర్తు చేశారు. మిగిలిన 35 వేల ఎకరాలను తక్షణం రాజధాని నిర్మాణానికి వినియోగించవచ్చని, అవసరమైతే తమ భూములను అప్పగించేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉన్నామని రైతులు ముక్తకంఠంతో చెప్పారు.

English summary

 The health and hospitality sector is eyeing on Guntur to expand their businesses in view of the new capital establishment in the Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X