మంచు చరియలు విరిగిపడి 14మంది సైనికుల మృతి: తెలుగు జవాను కూడా

జమూకశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలో గురెజ్ సెక్టార్‌ పరిధిలో మంచు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చేరింది.

శ్రీనగర్: జమూకశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలో గురెజ్ సెక్టార్‌ పరిధిలో మంచు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చేరింది. గురెజ్ సెక్టార్‌లో సైనిక శిబిరంపై మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ సిబ్బంది ఇప్పటివరకు ఆరుగురు జవాన్లను రక్షించారు.

మంచు చరియల్లో కూరుకుపోయినట్లు గుర్తించిన ఆరుగురు జవాన్లను ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించి సురక్షితంగా కాపాడారు. మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తుంది.

Gurez (J&K) avalanches: Death toll rises to 14; missing bodies of 4 jawans recovered

తెలుగు జవాను మృతి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) భారత సైన్యంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తుండగా మంచు కొండ చరియలు విరిగిపడటంతో మృతి చెందాడని అధికారులు తెలిపారు. ఈ మేరకు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నాగరాజుకు ఏడాది క్రితమే సమీప బంధువు అనూషతో వివాహం జరిగింది. రాజు మరణంతో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+