మనసు మార్చుకున్న జీవీ రెడ్డి - నెక్స్ట్ స్టెప్..!?
జీవీ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి. కూటమి ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన జీవీ రెడ్డికి ఊహించని విధంగా టీడీపీ కేడర్ నుంచి మద్దతు లభించింది. ఆయన రాజీనామాను క్షణాల్లో ఆమోదించటం పార్టీ శ్రేణులకు నచ్చ లేదు. రాజీనామా తరువాత తాజాగా బడ్జెట్ పైన జీవీ రెడ్డి తొలి సారి స్పందించారు. చంద్రబాబు పైన తన గౌరవం చాటుకున్నారు. దీంతో, తిరిగి జీవీ రెడ్డి టీడీపీలో రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగింది. అయితే.. జీవీ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పైన స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
రాజీనామా నిర్ణయంతో
ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తాజాగా తన పదవితో పాటుగా టీడీపీకి రాజీ నామా చేసారు. ఫైబర్ నెట్ లో చోటు చేసుకున్న పరిణామాలు.. అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవటం పైన జీవీ రెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశా లను ప్రభుత్వానికి డామేజ్ చేసే విధంగా ఓపెన్ గా మాట్లాడటం పైన మందలించినట్లు సమాచారం. దీంతో, జీవీ రెడ్డి తన పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేసారు. తాను భవిష్యత్ లో ఒక ఏ పార్టీలో చేరనని జీవీ రెడ్డి స్పష్టం చేసారు. బడ్జెట్ పైన చేసిన ట్వీట్ లో మాత్రం చంద్రబాబు పైన గౌరవం చాటుకునే లా కీలక వ్యాఖ్యలతో మరోసారి చర్చకు కారణమయ్యారు. జీవీ రెడ్డి రాజీనామా పైన టీడీపీ కేడర్ స్పందించింది.

కేడర్ మద్దతు
జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదించటం పైన కేడర్ ముక్తకంఠం తో ఖండించింది. చంద్రబాబు, లోకేష్ ను పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేది కగా ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేసే నేతలు, కేడర్ కంటే అధికారులకే ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీసారు. ఆత్మగౌరవం కోసమే జీవీ రెడ్డి రాజీనామా చేసారంటూ.. ఆయనకు మద్దతుగా నిలిచారు. జీవీ రెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేసారు. అధికారంలో లేనప్పుడే పార్టీ కోసం పోరాడిన వ్యక్తి.. ఇప్పుడు రాజీనామా చేయడంపై టీడీపీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చురకలు అంటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నాయకత్వం పైన కేడర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఒక్క సారిగా జీవీ రెడ్డికి అనూహ్య మద్దతు లభించింది. దీంతో, జీవీ రెడ్డి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం సాగింది.
ఏం చేయబోతున్నారు
జీవీ రెడ్డి తాజాగా బడ్జెట్ లో ప్రభుత్వ ఆలోచనలను.. తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలం గా వ్యాఖ్యలు చేసారు. దీంతో, ఇక జీవీ రెడ్డి పార్టీలోకి వస్తారనే ప్రచారానికి బలం పెరిగింది. తిరిగి ఆయనకు నామినేటెడ్ పదవి కాకుండా.. మరింత ప్రాధాన్యత ఇస్తారనే వాదన వినిపించింది. ఇక, ఇప్పుడు జీవీ రెడ్డి టీడీపీలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతు న్నారు. బీజేపీ లోకి జీవీ రెడ్డి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. కూటమిలో ఉన్న టీడీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరే ఛాన్స్ ఉండదని వారు కొట్టి పారేస్తున్నారు. మరి కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఆ తరువాత పరిణామా లకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం నుంచి జీవీ రెడ్డి మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మరి.. జీవీ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications