పేదరికంలో పుట్టి, కింద కూర్చోమన్నా సరేనంటారు: బాబుపై జీవీఎల్ తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేతలు జీవీఎల్ నర్సింహా రావు, పురంధేశ్వరి, సునీల్ ధియోదర్‍లు ఆదివారం వేర్వేరుగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దేశదిమ్మరిలా దేశమంతా తిరుగుతున్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ ఆరోపించారు.
ప్రజల సొమ్ముతో రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. విలాసాలు, ప్రత్యేక విమానాల పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తూ వృథా చేస్తున్నారన్నారు. అధికారులారా.. తస్మాత్ జాగ్రత్త, ఇష్టారీతిన ఖర్చు పెడుతున్న చంద్రబాబుకు అతిగా సహకరించవద్దని హితవు పలికారు. ప్రజా దుర్వినియోగంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.

చంద్రబాబు ఏదో దోచిపెడతారని దేశంలోని ఇతర నేతల ఆలోచన
చంద్రబాబు అందరి వద్దకు వెళ్లి దేబిరిస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. చంద్రబాబు ఏదో దోచి పెడతారని దేశంలోని ఇతర నేతలు ఆశపడుతున్నారని విమర్శించారు. నేతల భేటీలో చంద్రబాబుకింద కూర్చోమన్నా కూర్చునేలా ఉన్నాడని చెప్పారు. ముఖ్యమంత్రిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

పేదరికంలో పుట్టి మహారాజులా విలాస జీవితం
ప్రపంచంలో ఎవరికీ సాధ్యపడనంత విలాసవంతమైన జీవితం గడపడం చంద్రబాబుకు ఇష్టమని జీవీఎల్ ఆరోపించారు. విదేశీ పర్యటనలు, చార్టెర్ట్ ఫ్లయిట్ పేరుతో కోట్ల కొద్ది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చిత్తూరులో పేదరికంలో పుట్టినా ఇప్పుడు మహారాజులా ప్రజల సొమ్మును వెదజల్లుతున్నారని దుయ్యబట్టారు.

అధికారులకు జీవీఎల్ తీవ్ర హెచ్చరిక
హెరిటేజ్ పాల వ్యాపారంలో సంపాదించుకున్న మొత్తాన్ని చంద్రబాబు ఖర్చు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, ఇలాంటి విచ్చలవిడి విన్యాసాలకు అనుమతులు ఇస్తున్న అధికారులు చివరకు బాధ్యులుగా నిలుస్తారని జీవీఎల్ హెచ్చరించారు. చంద్రబాబు కోసం ఇష్టానుసారం అనుమతులు ఇచ్చే అధికారుల పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లపై ఆంక్షలు విధించే అవకాశముందని చెప్పారు. చంద్రబాబు విచ్చలవిడి ప్రజాధన దుర్వినియోగంపై అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు.
Recommended Video


ప్రజలు ఛీకొట్టినా.. బుద్ధా వెంకన్న ఆగ్రహం
కాగా, జీవీఎల్ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జీవీఎల్‌ను ప్రజలు ఛీకొట్టినా బుద్ధి మార్చుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్ అపాయింటుమెంట్ ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఫిర్యాదు చేయడానికే జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణలు గవర్నర్‌ను కలుస్తారని చెప్పారు. జీవీఎల్ ఆంబోతులా రాష్ట్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కత్తి దాడి డ్రామాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications