విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ తీర్మానం .. కౌన్సిల్ సమావేశంలో ఏం జరిగిందంటే
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని, వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ మినహాయించి అఖిలపక్ష పార్టీలు కేంద్రం తీరును నిరసిస్తూ తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మహా నగర పాలక సంస్థ జిహెచ్ఎంసి తీర్మానం చేసింది.

ఎన్నికల తర్వాత తొలి జీవీఎంసీ సర్వసభ్య సమావేశం.. హాజరైన అన్ని పార్టీల కార్పొరేటర్లు
ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఈరోజు మొదటి సారి జీవీఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వైసిపి ,టిడిపి ,జనసేన సిపిఎం సిపిఐ, బిజెపికి చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయసాయిరెడ్డి తో పాటుగా ఆ పార్టీకి చెందిన మిగతా ఎంపీలందరూ రాజీనామా చేయాలని టిడిపి ,జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభలో వాడీ వేడి చర్చ
విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసిపి ఎంపీలు పోరాటం చేయడం లేదని విమర్శలు గుప్పించారు. విశాఖ మహా నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్య సమావేశంలో స్టీల్ ప్లాంట్ రగడ కొనసాగడంతో సమావేశం రసాభాసగా మారింది . టీడీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ,అనకాపల్లి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్ప కేంద్రం తీరులో కదలిక రాదని వారన్నారు.

వైసీపీ ఎంపీల రాజీనామాలకు డిమాండ్ చేసిన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు
ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన సీఎం జగన్మోహన్ రెడ్డికి జరిగే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ఇక జనసేన పార్టీ నేతలు సైతం ఎంపీ విజయసాయిరెడ్డి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నేతలు పార్టీలకు అతీతంగా ఎంపీలు , ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన ఎంపీలను విశాఖ ప్రజలు తమ హృదయాల్లో పెట్టుకుంటారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే విశాఖ నగరం నామరూపాలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ వెళ్లి నిరసనకు సూచన .. సమావేశంలో విశాఖ ఉక్కు కోసం తీర్మానం
వచ్చే పార్లమెంటు సమావేశాలలో జీవీఎంసీకి చెందిన అన్ని పార్టీల కార్పొరేటర్లతో పాటుగా ఎమ్మెల్యేలు , ఎంపీలు అందరూ ఢిల్లీ వెళ్లి అక్కడ నిరసన తెలియజేయాలని సూచించారు. ఇక ప్రతిపక్ష పార్టీ సభ్యుల డిమాండ్లు, నిరసనలతో ఈరోజు మొదటి సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. అయితే తాము
కేంద్రంపై వివిధ మార్గాలలో ఒత్తిడి తెస్తూనే ఉన్నామని వైసీపీ ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నారు . స్టీల్ ప్లాంట్ కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇక ఈ క్రమంలోనే సర్వసభ్య సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ సభ్యులు తీర్మానం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications