విశాఖలో భారీ విజయం దిశగా కూటమి మేయర్ అభ్యర్ధి- లక్ష ఓట్లకు పైగా లీడ్ ..!

విశాఖపట్నం మహానగర పాలక సంస్థ జీవీఎంసీ(GVMC)కి జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. మేయర్ ఎన్నికల్లో అయితే కూటమి తరఫున నిలబడిన టీడీపీ నేత ముక్క శ్రావణి భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఆమె రికార్డు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు జీవీఎంసీ డివిజన్లలో సైతం కూటమి పార్టీల అభ్యర్ధులు పలు చోట్ల విజయం సాధించగా.. మరికొన్ని చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ పూర్తిగా తేలిపోయింది.

కాబోయే మేయర్ వంగవీటి రాధాకు పుట్టినరోజు కానుక..! పవన్ స్పెషల్ గ్రీటింగ్స్..!
కాబోయే మేయర్ వంగవీటి రాధాకు పుట్టినరోజు కానుక..! పవన్ స్పెషల్ గ్రీటింగ్స్..!

విశాఖపట్నం కార్పోరేషన్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గట్టి పోటీ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా అదంతా ఒట్టిదే అని ఇవాళ వెలువడిన ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్ధిగా రంగంలోకి దిగిన ముక్క శ్రావణి ఇవాళ ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచీ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తాజా సమాచారం మేరకు ముక్కా శ్రావణి ఏకంగా 1.19 లక్షల ఓట్లకు పైగా మెజార్టీలో కొనసాగుతున్నారు. ఆమెకు ఇప్పటివరకూ 2.56 లక్షలకు పైగా ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీ అభ్యర్ధి వరుదు కళ్యాణికి కేవలం 1.37 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మేయర్ గా ముక్క శ్రావణి ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది.

GVMC Results TDP Dominates Visakhapatnam Mayor Race Leads YSRCP by Over 1 19 Lakh Votes
GVMC కౌంటింగ్ అప్డేట్ - మేయర్, డివిజన్లలో ఆధిక్యం ఎవరిది ?
GVMC కౌంటింగ్ అప్డేట్ - మేయర్, డివిజన్లలో ఆధిక్యం ఎవరిది ?

మరోవైపు జీవీఎంసీ డివిజన్లలో సైతం కూటమి పార్టీల జోరు కొనసాగుతోంది. మొత్తం 120 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకూ అందిన ఫలితాల్లో టీడీపీ 27 చోట్ల విజయం సాధించగా.. జనసేన 10 చోట్ల, బీజేపీ 5 చోట్ల, వైఎఎస్సార్సీపీ నాలుగు చోట్ల గెలిచాయి. మరో రెండు డివిజన్లలో స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. ఇందులో కమ్యూనిస్టు అభ్యర్ధి ఒకరు ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇక్కడి ఓటర్లు సీపీఐ అభ్యర్ధిని గెలిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+