వైసీపీ హయాంలో ధైర్యంగా - కూటమిలో అణగిమణిగి - టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు కీలక టీడీపీ నేతలతో పాటు దాదాపు ప్రతీ జిల్లాల్లోనూ ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఇబ్బందులు పడ్డామని చెప్పుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల చెప్పుచేతల్లో ఉన్న పోలీసులు తమను టార్గెట్ చేశారని వాపోయేవారు. కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు, నేతలు సొంత పార్టీ ప్రభుత్వం వచ్చినా తమ పరిస్ధితి మారలేదని వాపోతున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలోనే ధైర్యంగా ఉన్నామని సెటైర్లు వేస్తున్నారు.
ఇదే క్రమంలో పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. టీడీపీ శ్రేణుల పరిస్థితి మరీ విచిత్రంగా మారిందని ఆయన వాపోయారు. తాజాగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన పార్టీ నేతల భేటీలో అరవిందబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికీ ఇసుక, మద్యం వైసీపీ మాఫియా చేతుల్లోనే ఉందని, ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారని, కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అరవిందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదని తాజా ఘటనతో నిరూపితమైంది.












Click it and Unblock the Notifications