నాడు చిరంజీవి, అదే బాటలో పవన్- ఇష్టం లేకపోయినా, జోగయ్య లేఖ..!!
కాపులకు మేలు కొలుపు పేరుతో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ రాసారు. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కాపులు, బీసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కాలంటే ఐకమత్యం ప్రదర్శించాలని సూచించారు. రాజకీయ లక్షణాలను పెంచుకోవాలని కోరారు. పవన్ ఒంటరిగా అడుగులు వేస్తే ఫలితాలు ఏంటనేది 2019లో స్పష్టమైందన్నారు. బలవంతుడైన శత్రువుని కొట్టాల్సి వచ్చినప్పుడు ఇష్టం లేకపోయినా సహాయం తీసకున్నారని పవన్ గురించి విశ్లేషించారు.
రాజ్యాధికారం దక్కాలంటే దైర్యవంతుడైన నాయకుడు కావాలి, జనాకర్షన గల సవ్యసాచి కావాలని పేర్కొన్నారు. హరి రామజోగయ్య నాడు ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి రాజకీయం గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు నేనున్నానంటూ చిరంజీవి వచ్చారన్నారు. అందరం ఆదరించామన్నారు. చేయూత ఇచ్చామని చెప్పారు. అభిమన్యుడై మిగిలారని విశ్లేషంచారు. అదే బాటలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయ ఆరంగేట్రం చేసారని చెప్పుకొచ్చారు. అన్నకు మంచిన జనాకర్షణ ఉందని... లక్ష్యసాధనకు అతని వ్యూహాలు అతనికి ఉన్నాయని వివరించారు. బలవంతుడైన శత్రువుని కొట్టాల్సి వచ్చినపుడు ఇష్టం లేకపోయినా మరొకరి సమాయం తీసుకోవటం అనే రాజనీతిజ్ఙత తెలిసినవాడుగా పవన్ గురించి చెప్పుకొచ్చారు.

పొత్తు ధర్మంలో తనకి దక్కాల్సిన ఎమ్మెల్యే, ఎంపి సీట్లను దక్కించుకోడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని జోగయ్య పేర్కొన్నారు. తన గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా తెలుగుదేశం కింద జనసేనాని అని కాకుండా తెలుగుదేశం పక్కన జనసేన అని ప్రకటించారని వివరించారు. అతను తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక వ్యూహాంఉంటుందనడంలో సందేహపడాల్సిన పనిలేదన్నారు. అందరూ ధైర్యంగా ముందుకు నడవండంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలలో విజయమే ధ్యేయంగా ముఖ్యమైన పాత్ర వహించగల ఆర్దిక స్థోమత ఉన్న నమ్మకస్తులైన అభ్యర్దుల ఎంపికే కష్టమని పేర్కొన్నారు. అదే ప్రయత్నంలో పవన్ ఉన్నారన్నారు. రాజ్యాధికారం దక్కించుకొనే విషయంలో యాచించే స్థాయి నుంచి శాసించే తీసుకొచ్చే క్రమంలో అందరి గౌరవం నిలబెట్టే విషయంలో సందేహాలు అవసరం లేదని జోగయ్య పేర్కొన్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications