ఆరేళ్లపాటు జిల్లాకు 50కోట్లు: కేంద్ర నిర్ణయమని హరిబాబు
విశాఖపట్నం/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై విశాఖ బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందించారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.
మంగళవారం హరిబాబు విశాఖలో మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం నిర్ణయించగా.. 2014-15 సంవత్సరానికి మినహా... మిగిలిన సంవత్సరాలకు ఇప్పటికే 22వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం కేటాయించిందని తెలిపారు.

ఆ సంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సిన రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరుపుతోందని చెప్పారు.
అంతేగాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్ణయించే ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏడాదికి ఒక్కో జిల్లాకు రూ.50కోట్ల చొప్పు ఆరేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications