సోనియా కాళ్ల వద్ద బేరానికి: విభజనపై హరి లేఖ

తెలుగుతల్లి ముక్క చెక్కలైందని, అధికార ప్రాపకం కోసం రాజకీయ వ్యభిచారులు తెలుగుతల్లికి గర్భశోకం కలిగించారని ఆయన అన్నారు. చీలిన తెలుగుజాతిని చూసి తారకరాముని ఆత్మ ఘోషిస్తోందని ఆయన అన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు తలా పాపం, తలా పిడికెడు అన్నట్లు వ్యవహరించాయని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఒక్కో జిల్లాను ఒక్కో రాష్ట్రంగా ఆశ్చర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనలో నాయకులు వికృత స్వరూపం బయటపడిందని ఆయన అన్నారు. తెలుగుతల్లిని నిలువునా చీల్చారని, ఇలాంటి నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హరికృష్ణ అన్నారు. ఈ నేతలా తెలుగుతల్లి బిడ్డలు అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు ఉత్తర ప్రగల్భాలు పలికారని ఆయన అన్నారు.
రాజకీయం ఇంత నీచంగా ఉంటుందా అని ఆయన ఆశ్చర్యపోయారు. సొంత పార్టీపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాస్త్రీయ విభజన జరగాలంటే ప్రతి గ్రామంలో బ్యాలెట్ నిర్వహించాల్సి ఉండిందని ఆయన అన్నారు. అధికారం కోసం స్వార్థంతో వ్యవహరించిన నేతలు తప్పకుండా రాజకీయ వ్యభిచారులేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications