అది కుట్ర.. ఫేక్; వైసీపీ ట్రాప్ లో పడొద్దు: హరిరామ జోగయ్య బహిరంగలేఖ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రశ్నలని సంధిస్తూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని మరో లేఖ రాయడం, అందులో హరి రామ జోగయ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాలలోను ప్రజలలోను దుమారంగా మారింది. అయితే తాజాగా తన పేరుతో వస్తున్న లెటర్ ల పైన కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య స్పందించారు.

ఏపీ రాజకీయాలపై హరిరామ జోగయ్య సంచలన బహిరంగలేఖ రాశారు. తన పేరుతో వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ లెటర్ అని ఆయన స్పష్టం చేశారు . రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీల మైత్రి బంధాన్ని చెడగొట్టడం కోసం కొందరు తన పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారని ఆరోపించారు.
రానున్న కాలంలో జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలడంతో వైసీపీ శ్రేణులు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని హరి రామ జోగయ్య అసహనం వ్యక్తం చేశారు. టిడిపి, జనసేన పార్టీల శ్రేణులు ముఖ్యంగా కాపు నేతలు వారి ట్రాప్ లో పడద్దని హరిరామ జోగయ్య విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమైన గమనిక అంటూ పేర్కొన్న హరి రామ జోగయ్య రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు ఆసరాగా చేసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డామేజ్ చేయడం కోసం తన పేరు ఉపయోగించుకుని తెలుగుదేశం, జనసేన పార్టీల మైత్రిబంధాన్ని దెబ్బతీసి, అసత్య ప్రచారానికి తెర లేపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అబద్ధపు లేఖను ప్రచారం చేస్తున్నారన్నారు.
కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం అనే శీర్షికతో ఫేక్ లెటర్లు రిలీజ్ చేసి జనసేన టిడిపి పొత్తులను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాదు ఎన్ని కుట్రలు పన్నినా ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తనకు ఇప్పటికే సమాచారం ఉందన్నారు. ఎవరు ఏం చేసినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే వరకు మనమంతా ఆయన వెంటే ఉంటాలని, ఉంటామని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications