డిప్యూటీ సీఎం అయిన పవన్‌ను వదలని హరిరామ జోగయ్య
మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. గతంలో పలుమార్లు పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారాయన. 20 స్థానాలు తీసుకుని ఒకరి క్రింద పని చేయాల్సిన అవసరం లేదంటూ బహిరంగంగానే ఆయన పవన్ కల్యాణ్ తీరును ప్రశ్నించారు. జనసేన 50 స్థానాల్లో తగ్గకుండా పోటీ చేయాలని సూచించారు.
జనసేనకు హరిరామ జోగయ్య తలలో జోరీగలా తయ్యారు కావడంతో ఆయనపై పవన్ కల్యాణ్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.పార్టీలో తనని ప్రశ్నించే వారు అసవరం లేదని.. నచ్చకపోతే బయటకు వెళ్లిపోవచ్చని హరిరామ జోగయ్యను ఉద్దేశించి పరొక్షంగా పవన్ కల్యాణ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఎన్నికల హడావిడి ముగియడం కూటమి విజయం సాధించడంతో హరిరామ జోగయ్య మరోసారి తన నోటికి పని చెప్పారు.

కూటమి విజయంపై ఆయన స్పందిస్తూ..ఏపీలో కూటమి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారాయన. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లల్లో పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నానని ఆయన తెలిపారు. సంక్షేమ ఫలాలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి తప్ప రాజకీయ లబ్ధి కోరే విధంగా ఉండకూడదని తన లేఖలో హరిరామ జోగయ్య పేర్కొన్నారు. అభివృద్ది కూడా ఒకే చోట కేంద్రీకరించొద్దని పేర్కొన్నారు.
ప్రధానంగా కాపు సామాజికవర్గం ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను తమ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నానని పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని సూచించారు. సినిమాలు మానేయకుండానే సగం రోజులు షూటింగులకు, మిగిలిన సగం రోజులు రాష్ట్ర పరిపాలనకు కేటాయించాలని పవన్ కల్యాణ్‌ను కోరారు. రోడ్లు, డ్రైనేజీలు, సాగు నీరు, విద్యుత్, పారిశుధ్ద్యం లాంటి సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. మరి హరిరామ జోగయ్య రాసిన లేఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications