మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం
మెదక్: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలోని నంగునూరు ఎర్ర చెరువులో బుధవారంనాడు చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా చెరువు పరిశీలిస్తూ అక్కడ ఉన్న జేసీబీ ఎక్కడానికిక ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన కాలు బురదలో కూరుకుపోయింది. దీంతో అదుపుతప్పి కిందపడబోగా పక్కనే కార్యకర్తలు హరీష్‌ను పట్టుకున్నారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది.

చెరువంతా కలియ దిరుగుతూ పూడిక తీస్తున్న ప్రొక్లెయినర్ వద్దకు చేరుకుంటున్న క్రమంలో ఆ ప్రమాదం సంభవించింది. బురద పైభాగం ఎండిపోవడంతో గట్టిగా ఉందని గమనించి అడుగువేయడంతో రెండు కాళ్లు బురదలో దిగబడిపోయాయి. దీంతో మంత్రి పక్కనే ఉన్న జడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకుడు కమాల్‌షరీఫ్, మరికొందరు మంత్రిని పట్టుకొని పైకి లాగారు.

పూడికమట్టిని కాకుండా లోతుగా వేరే మట్టిని ఎందుకు తీస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. బూట్లు, ప్యాంట్‌కు అంటుకున్న బురదను కడిగేందుకు నాయకులు నీళ్లు తెచ్చినా మంత్రి నిరాకరించారు. బూట్లు విప్పి చెప్పులు వేసుకొని వెళ్లిపోయారు.













Click it and Unblock the Notifications