టి పౌరుషాన్ని చూస్తారా?: సంపత్, ఇబ్బందిపడ్డ హరీశ్
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర భారీ నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆర్‌డిఎస్ పనులను సీమాంధ్ర నాయకులు బాలనాగిరెడ్డి, తిక్కారెడ్డి అడ్డుపడడం భావ్యం కాదని చెప్పేందుకు హరీశ్ రావు మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆయన పక్కన ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ నిల్చున్నారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడటం పూర్తికాగానే సంపత్ మాట్లాడుతూ.. సీమాంధ్ర నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖబడ్దార్ అంటూ ధ్వజమెత్తడం ప్రారంభించారు. తెలంగాణ పౌరుషాన్ని చూస్తారా? ఆర్‌డిఎస్ వద్దకు రండి.. అంటూ ఇంకా తీవ్ర స్థాయిలో మాట్లాడుతుండగా, కొంత ఇబ్బంది పడిన మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సంపత్ కూడా మాట్లాడటం ముగించేశారు.

అంతకుముందు హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆర్‌డిఎస్ గేట్లపై ఆరు అంగుళాల ఎత్తు పెంచడం అన్యాయం, అక్రమం అంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. 85 వేల 500 ఎకరాలకు నీరు ఇచ్చేలా బచావత్ ట్రిబ్యునల్ ఇదివరకే తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. 15.9 టిఎంసిల నీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రేశేఖర్ రావు లోగడ ఆర్‌డిఎస్ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు.
కాగా, రాయలసీమకు చెందిన కొంత మంది బలిశెలతో, బాంబులతో ప్రాజెక్టుపై దాడి చేయడానికి యత్నించారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆరు అంగుళాలు పెంచడానికి చర్యలు తీసుకుంటే రాయలసీమకు చెందిన బాలనాగిరెడ్డి, తిక్కారెడ్డి కాంట్రాక్టర్లపై దౌర్జన్యం చేయించారని హరీశ్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications