వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి తావు లేదు: హారీష్, కేసీఆర్‌కు టీ కాంగ్ ప్రశ్న

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డిసెంబర్ నుంచి రాష్ట్రంలో పూడికతో నిండిన చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈమేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.

చెరువుల పునరుద్ధరణకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రోక్యూర్ మెంట్ టెండర్ల ద్వారా, అవినీతికి తావు లేకుండా చెరువులను పునరుద్ధరిస్తామని అన్నారు.

చెరువుల పునరుద్దరణలో రైతులు, విద్యార్థులు, అధికారులను భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు.
డిసెంబర్ నుంచి మే నెల వరకు చెరువులను పునరుద్ధరించి, మండల కేంద్రాల్లో ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Harish Rao said we send rs 1000 proposals to centre

కేసీఆర్‌‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రశ్న

కేసీఆర్ తన ఐదు నెలల పాలనలో చేసిన ఒక్క మంచి పనైనా చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గండ్ర వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందన్న కేసీఆర్ తన పార్టీ ఎంపీలతో పార్లమెంట్‌లో సమస్యలు ఎందుకు ప్రశ్నించడం లేదని వారు ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలో కలిసిపోయిన సందర్భంగా ఎందుకు నోరెత్తలేదని టీకాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనైనా తెలంగాణ సమస్యలను ప్రస్తావించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ఏనాడూ రాజకీయ ఫిరాయింపులు ప్రోత్సహించలేదన్నారు. ప్రజా సమస్యలు విస్మరించిన కేసీఆర్ స్వార్థ రాజకీయాలే ఎజెండాగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

English summary
Telangana Minister Harish Rao said we send rs 1000 proposals to centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X