బొత్సతో లింక్: పవన్ కళ్యాణ్‌కు హరీష్ లీగల్ నోటీసు
హైదరాబాద్: జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు టి. హరీష్ రావు లీగల్ నోటీసు పంపించారు. కాంగ్రెసు నాయకుడు బొత్స సత్యనారాయణతో తనకు కేబుల్ వ్యాపారంలో సంబంధం ఉందంటూ ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడంపై హరీశ్‌రావు ఆ లీగల్ నోటీసు పంపించారు.
పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేకపోతే న్యాయపరంగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు ఈ నోటీసులో తెలిపారు. పవన్ కల్యాణ్ గత రెండు రోజుల నుంచి ఈ ఆరోపణలు పదే పదే చేశారని హరీశ్ న్యాయవాది నోటీసులో తెలిుపారు. పవన్ కళ్యాణ్ ఆ ఆరోపణలు చేసిన వెంటనే హరీశ్‌రావు స్పందించారు, బొత్సతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని చేసిన ఆరోపణలు నిరూపించాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సోమవారం రాత్రి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
డిచ్‌పల్లి మండలానికి చెందిన అడ్వకేట్ వి.రవికుమార్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ పవన్‌పై భారత శిక్షాస్మృతిలోని 153 (ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్‌జోషీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు డిచ్‌పల్లి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications