ఆంధ్రజ్యోతికి ఊరట: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్: తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేయడంపై హైకోర్టులో వేసిన ఫిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిటిషన్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతోపాటు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది.
ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డికి, ఎంఎస్‌వోల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3వ (గురువారం) తేదీకి వాయిదా వేసింది. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు నిలిపివేతపై అసోషియేట్ ఎడిటర్ మూర్తి వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు తగు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈనెల 15వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఎంఎస్‌వోలు కారణంగా నిలిపివేశారని, ఇది తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన పరోక్ష ఒత్తిళ్లమేరకు ఎంఎస్‌వోలు ఈ చర్యకు పాల్పడ్డారని మూర్తి అన్నారు అన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గానీ, ఆంధ్యజ్యోతిగానీ ఎవరినీ కించపరుస్తూ ఎలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయలేదని, ప్రచురించలేదని మూర్తి తెలిపారు. కానీ రాజకీయ దురుద్దేశంతో కొంత మంది ప్రోద్భలం, ప్రోత్సాహం మేరకు ఎంఎస్‌వోలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.
దీనికి సంబంధించి అధీకృత అధికారులకు, కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఏబీఎన్ ప్రతినిధి బృందం కలిసి విన్నవించిందని మూర్తీ చెప్పారు. అయినా ఎంఎస్‌వోలు ఛానల్ ప్రసారాలు మాత్రం పునరుద్ధరించలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని మూర్తి చెప్పారు.












Click it and Unblock the Notifications