నాకు తెలిసి: జగన్‌పై జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు, 'ఐవైఆర్ వెనుక జగన్'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అక్రమాస్తుల్లో నా పేరు తొలగించండి: జగన్, మోసం చేశాడు, పక్కా ఆధారాలు: సిబిఐ

2014లో వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన జలీల్ ఖాన్ సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ పైన నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా శుక్రవారం కూడా విమర్శలు చేశారు.

జగన్‌కు విలువ తెలియదు

జగన్‌కు విలువ తెలియదు

జగన్‌కు ధనం గురించి తప్ప జనం విలువ తెలియదని జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ విద్యాధరపురంలో జరిగిన జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పలేదు, నాకు తెలిసి

వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పలేదు, నాకు తెలిసి

ధనం మిగల్చడం గురించే తప్ప, మిగిలిన వాటి గురించి జగన్‌కు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పలేదని జలీల్ ఎద్దేవా చేశారు. తనకు తెలిసినంత వరకు నీళ్లు మిగిలించడం, ఇంకుడుగుంతలు, నదుల అనుసంధానం గురించి జగన్‌కు, వైయస్‌కు తెలియదన్నారు.

జగన్‌కు చెప్పినా ఎక్కవు

జగన్‌కు చెప్పినా ఎక్కవు

ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి జగన్‌కు చెప్పినా ఆయనకు ఎక్కవని జలీల్ ఖాన్ అన్నారు. జగన్‌కు తెలిసిందల్లా ఒకటేనని, ధనం ఏ రకంగా మిగిలించాలనే చూసుకుంటారని చెప్పారు.

ఐవైఆర్ మాటల వెనుక జగన్ హస్తం: ఆనంద్ సూర్య

ఐవైఆర్ మాటల వెనుక జగన్ హస్తం: ఆనంద్ సూర్య

రాజధాని అమరావతిపై ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యల వెనుక జగన్ హస్తం ఉందని బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. లోటస్ పాండ్ స్క్రిప్ట్ ప్రకారం కృష్ణారావు నడుచుకుంటున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సీఎం చంద్రబాబును విమర్శిస్తే ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and MLA Jaleel Khan on Friday fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy. He said that Jagan only know about money, he did not know about people issues.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X