కేసీఆర్ వ్యాఖ్యలతో ఏపీకి తలనొప్పి; తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో పనిలేదన్న డిప్యూటీ సీఎం ధర్మాన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది మాట్లాడినా దాని ప్రభావం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడుతుంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ పాలసీపై మండిపడిన విషయం తెలిసిందే. దశలవారీగా అన్ని రంగాల్లో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కేంద్ర విద్యుత్ పాలసీలో పేర్కొందని కానీ తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రసక్తేలేదని ఘంటా పథంగా చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలనొప్పిగా తయారైంది.

కేసీఆర్ వ్యాఖ్యలతో ఏపీలో చర్చ ..
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించిన పరిస్థితి చోటు చేసుకుంది. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నష్టం చేసే విద్యుత్ మీటర్లు బిగించబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉండటంతో రైతన్నలలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

క్లారిటీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం
కేంద్ర నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వ్యవసాయానికి, రైతులకు నష్టం చేసే విద్యుత్ మీటర్లను బిగించేది లేదని పేర్కొని, ఏపీలో విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతోంది. విద్యుత్ మీటర్లు బిగించటం మంచిదే అయితే తెలంగాణాలో ఎందుకు అమలుచెయ్యటం లేదు అని చర్చ సాగుతుంది. జగన్ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించటం వల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న కోణంలో చర్చిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

కేసీఆర్ వ్యాఖ్యల గురించి మనకు అనవసరం .. బోర్లకు మీటర్లతో నష్టం లేదు
శ్రీకాకుళంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గురించి మనకు అవసరం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించటం వల్ల రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఇది శిలాక్షరాలు తో రాసుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ధాన్యం కొనుగోళ్ళపైనా క్లారిటీ ఇచ్చిన ధర్మాన కృష్ణ దాస్
ఇదే సమయంలో ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి రైతులకు అవగాహన లేకపోవడమే కారణమని ఆయన పేర్కొన్నారు. లేట్ వెరైటీలు పండించడం, పంట నూర్పిడి ఆలస్యం కావడం కూడా సమస్యగా మారిందని ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. మిల్లర్లకు సమయానికి ధాన్యం అందించలేకపోతున్నారు అని, అందుకే ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
ఇక రైతుల సమస్యలు ఏవి ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, రైతుల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications