వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు మరోసారి గుండెపోటు: ఆస్పత్రిలో చేరిక
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు మరోసారి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నగరంలోని స్టార్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఆయనకు రెండు స్టెంట్స్ వేశారు వైద్యులు. గతంలో కూడా ఒకసారి గుండెపోటు రావడంతో ఒక స్టెంట్ వేశారు. సమాచారం అందుకున్న యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు.

ఇటీవల గన్నవరం రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందారు యార్లగడ్డ వెంకట్రావు. టీడీపీ నుంచి వైసీపీ బాట పట్టిన వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావుకు మధ్య రాజకీయ విభేదాలు రగులుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందో.. రాదో అనే ఆందోళనలో యార్లగడ్డ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications