కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సాయం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 15 లక్షల చెప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పాక్షికంగా గాయాలైన వారికి రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
కాశీ బుగ్గ ఆలయం తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు. అలాగే పాక్షికంగా గాయాలైన వారికి రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఘటన జరిగిన ప్రాంతాన్ని.. అలాగే పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో బారికేడ్లు ఏర్పాటు చేసినా రద్దీ కారణంగా సరిపోలేదని అన్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రులు, అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

మరోవైపు కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా రావడంతో భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరగి తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మరికొంత మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications