వాయుగుండం: చెన్నైకి జలగండం, తుఫాన్ పేరు 'రావోను', తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వరుణ దేవుడు వర్షంతో ముంచెత్తుతున్నాడు. తూర్పుదిశగా కదులుతూ వాయుగుండం బలపడుతోంది. ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

గతేడాది చెన్నై సహా పలు జిల్లాలను నీట ముంచిన వరుణుడి విలయం మళ్లీ తప్పదా? అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో తీరప్రాంతంలోని మండల అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నైకి సూమారు 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.

ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే వాయుగుండం తుఫానుగా మారితే 'రావోను' గా వాతావరణ శాఖ అధికారులు పిలుస్తున్నారు. ఈ వాయుగుండం ఏకంగా 25 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని అధికారులు చేసిన హెచ్చరికలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంబరంబాక్కం ప్రాంతంలో 17.7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత ఏడాది వర్షాల సమయంలో ఈ జలాశయం గేట్లను అర్ధరాత్రి ఎత్తేయడంతో అడయారు పొంగిపొర్లడం, దక్షిణ చెన్నైలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

దీంతో జలాశయంలోకి వచ్చి చేరుతున్న నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. మరోవైపు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా విపత్తులు ఏర్పడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.

వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే సూచనలుండటంతో యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. దాంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో వర్షం కుండపోతలా కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

నెల్లూరుకు 170 కిలోమీటర్ల దూరంలో వాయగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు ఆత్మకూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలో వర్షం కురిసింది.

తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు వాయుగుండం ప్రభావం ఉండటంతో నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోని పలుప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దిశ మార్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇది తుఫానుగా మారితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరకోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. సూళ్లూరుపేట 15, విశాఖలో 2, నెల్లూరులో 4 సెం.మీ వర్షపాతం కురుస్తోంది.

దీంతో దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతేడాది జరిగిన ఘటనలు గుర్తుకు వచ్చాయో, ఏమో తెలియదు కానీ... ప్రయాణికులతో విశాఖ నుంచి మంగళవారం రాత్రి చెన్నై బయలుదేరిన వంశీకృష్ణ ట్రావెల్స్ బస్సు నెల్లూరు జిల్లాలో నడిరోడ్డుపైనే నిలిచిపోయింది.

బస్సు నిలిచిపోవడానికి సాంకేతిక కారణాలేమీ లేవు. డ్రైవర్ అప్రమత్తమే బస్సును నిలిపేసింది. బస్సును కదిలించమన్న ప్రయాణికుల విజ్ఞప్తిని డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చెన్నైలో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, గతేడాది సంఘటనన గుర్తు చేస్తూ డ్రైవర్ తాను బస్సును చెన్నైకి పోనివ్వలేనని తేల్చి చెప్పాడు. దీంతో ప్రయాణికులు నడిరోడ్డుపైనే అవస్థలు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+