వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్షాలు, అద్భుతం: తిరుమలలో నామాలుగా జలపాతం, కాళహస్తిలో లింగాన్ని తాకిన జలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, ఎస్పీఎస్ నెల్లూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. వాగులు పొంగుపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. గత యాభై ఏళ్లలో కురవని వర్షం చూశామని చాలామంది చెబుతున్నారు.

భారీ వర్షాల కారణంగా తిరుమల కొండల్లో భక్తులకు జలధారలు కనువిందు చేస్తున్నాయి. ఓ చోట రెండు రోజుల క్రితం జలధార శ్రీవారి తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ భక్తులను అలరించింది. ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం సమీపంలో ఈ దృశ్యం కనిపించింది.

Heavy rains in AP: Waterfall touches Lord Shiva

తాజాగా, శుక్రవారం నాడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేండాం సమీపంలోని బైరవకోన వద్ద జలపాతం నుంచి వస్తున్న నీరు... శివలింగాన్ని తాకుతూ అందర్నీ ఆకట్టుకుంటుంది. తిరుమలలో, శ్రీకాళహస్తిలో భక్తులకు ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

English summary
Waterfall touches Lord Shiva in Srikalahsthi Mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X