చంపాపేటలో కొట్టుకుపోయిన కారు: ఏడుకు చేరిన మృతులు, కంట్రోల్ రూం నెంబర్లివే

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం భీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా చంపాపేటలో ఓ కారు కొట్టుకుపోయింది. సమయానికి స్పందించిన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని రక్షించారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన మ్యాన్‌హోల్‌లు తెరవొద్దని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్లు, ఏంఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. బాధితులకు సాయమందిచేందుకు హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటు చేశారు.

 ఖైరతాబాద్‌లోని మెట్రో రైల్వే బుకింగ్ కౌంటర్ లోకి చేరిన నీరు

ఖైరతాబాద్‌లోని మెట్రో రైల్వే బుకింగ్ కౌంటర్ లోకి చేరిన నీరు


నగరంలో బుధవారం ఉదయం కురిసిన కుండపోత వర్షం కారణంగా ఖైరతాబాద్‌లోని మెట్రో రైల్వే బుకింగ్ కౌంటర్ లోకి చేరిన నీరు చేరింది. దీంతోపాటు రాజ్ భవన్ సమీపంలోని పట్టాలపైకి నీరు చేరడంతో పలు ఎంఎంటీఎస్ రైళ్లను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది.

మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్

మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఏడుగురు మృతి చెందారని మల్కాజ్‌గిరి, ఫీవ‌ర్ ఆసుప‌త్రి ప్రాంతాల్లో వ‌ర్ష‌పాతం అధికంగా ఉందని, న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లో ప‌ది సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఖైర‌తాబాద్ ద‌గ్గ‌ర ట్రాఫిక్ కొంత క్లియ‌ర్ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు చ‌నిపోయారని, మృతుల కుటుంబాల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రంలో ఇప్పటికే చాలా పాత భ‌వనాల‌ను కూల్చేశామ‌ని, పురాత‌న భ‌వ‌నాల్లో ఉన్న‌వారిని కార్పొరేట‌ర్లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలని బొంతు రామ్మోహ‌న్‌ సూచించారు. ఇంకా ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలని ఆయ‌న అన్నారు. ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు సిబ్బంది రంగంలోకి దిగార‌ని చెప్పారు.

 ప్రమాదకర స్థాయికి హుస్సేన్ సాగర్ నీటిమట్టం

ప్రమాదకర స్థాయికి హుస్సేన్ సాగర్ నీటిమట్టం


హుస్సేన్ సాగర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో హుస్సేన్ సాగర్ తూమును జీహెచ్ఎంసీ అధికారులు తెరవనున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతంలోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.

చంపాపేటలో కొట్టుకుపోయిన కారు

చంపాపేటలో కొట్టుకుపోయిన కారు


భారీ వర్షాల కారణంగా చంపాపేటలో ఓ కారు కొట్టుకుపోయింది. సమయానికి స్పందించిన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని రక్షించారు.

 జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నెంబర్లు:

జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నెంబర్లు:

నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు కమిషనర్ జనార్ధన్ రెడ్డి జీహచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మేయర్‌తో పాటు కమిషనర్ అక్కడ నుంచే పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

స్కూళ్లకు సెలవు

స్కూళ్లకు సెలవు

లోతట్టు ప్రాంతాల్లో ఉండే స్కూళ్లకు వెసులుబాటు కల్పించారు. అవసరమైతే స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 040-21111 111, లేదా 100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆయన తెలిపారు.

 15 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు

15 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడలేనంత భారీ వర్షాలు బుధ, గురు, శుక్రవారాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షంగా కారణంగా హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు.

 రామాంతపూర్‌లో కూలిన గోడ

రామాంతపూర్‌లో కూలిన గోడ


రామాంతపూర్‌లో ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందారు. కుండపోతగా కురిసిన వర్షానికి ఇంటిపైకప్పు కూలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు భోలక్‌పూర్‌లో ఇంటి పైకప్పు కూలి ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి మృతి చెందింది.

 గాంధీ ఆసుపత్రికి తరలింపు

గాంధీ ఆసుపత్రికి తరలింపు


ఈ ఘటనలో గాయపడ్డ వారిని వెంటనే స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి వాటికి ఖాళీ చేయించే పనిలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు నిమగ్నమయ్యారు.

 సమీక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్

సమీక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్

భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్షించారు. ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు సహాయబృందాలను సిద్ధం చేశారు. భారీ వర్షాల కారణంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.

 ఎడతెరిపి లేని వర్షం

ఎడతెరిపి లేని వర్షం


నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా బోయినపల్లిలోని బాపూజీ నగర్‌లో చెరువుకు గండి పడింది. దీంతో పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దించారు.

 భారీగా నిలిచిపోయిన వర్షం

భారీగా నిలిచిపోయిన వర్షం


నగరంలోని ఖైరతాబాద్, మక్తా, బోలక్‌పూర్, రాణిగంజ్, అడ్డగుట్ట, ఇందిరాపర్కు కాలనీ, అంబర్‌పేట, అశోక్‌నగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి మాదాపూర్ పెట్రోల్ బంకు వరకు ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.

 ఏపీలో కూడా భారీ వర్షం

ఏపీలో కూడా భారీ వర్షం


ఇక అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో అత్యతధికంగా 14 సెంటీమీటర్ల వర్సం పడింది. జంగమేశ్వరంలో 12, దాచేపల్లి, కారంపూడిలలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

 అత్యధిక వర్షం తిమ్మాపూర్‌లో

అత్యధిక వర్షం తిమ్మాపూర్‌లో


కర్నూలు జిల్లా జలదుర్గంలో 11 సెంటీమీటర్లు, చిత్తూరు జిల్లా కాగితిలో 9 సెంటీమీటర్లు, కృష్ణాజిల్లా ఉయ్యూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 10 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్‌లో 12 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా తాండూరులో 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది.

మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్ మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్

మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్ మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్

ముషీరాబాద్ బోలక్‌పూర్‌లో పాత ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. మృతులు బిల్‌కిష్(27), మారేనా(3), జబా(5).

మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్ మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్

మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్ మృతుల‌కు రూ.ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా: జీహెచ్ఎంసీ మేయ‌ర్

రామాంతపూర్‌లో గోడ కూలి నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+